కన్నడ నటి సంయుక్త హెగ్డే ఆవేదన చెందుతుంది. తన పేరెంట్స్ కరోనా బారిన పడటంతో ఆమె ఆందోళన చెందుతుంది. ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో ఈ అమ్మడు హెల్ప్ చేయండి అంటూ వేడుకుంటోంది. ఈ మేరకు సంయుక్త హెగ్డే సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. `నా పేరెంట్స్ కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫాదర్‌కి రెమిడెసివిర్‌ టీకా అత్యంత అవసరం. ఇప్పుడాయనకు ఆరు ఇంజిక్షన్లు అవసరం. దాని కోసం ఎంతో మందిని సంప్రదించాను. కానీ దొరకడం లేదు. ప్రస్తుతానికైతే నా తండ్రిని బెంగూళూరులోని స్వగృహంలో ఉంచి చూసుకుంటున్నాం. ఆసుపత్రికి వెళ్లడానికి ఆయన నిరాకరిస్తున్నారు. ఇప్పుడు వారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంద`ని తెలిపింది. 

`రెమిడెసివిర్‌ ఇంజిక్షన్లని ఇంటికి తెచ్చిచ్చేవాళ్లు ఎవరైనా మీకు తెలిస్తే వెంటనే నాకు మెసేజ్‌ చేయండి. నేను ప్రయత్నించిన ఫోన్‌ నెంబర్లు అన్నీ స్విచాఫ్‌ వస్తున్నాయి. దయజేసి నాకు సాయం చేసి మా పేరెంట్స్ ని కాపాడండి.. ప్లీజ్‌` అంటూ వేడుకుంటోంది సంయుక్త హెగ్దే. కరోనాతో అనేక మంది సెలబ్రిటీలు బాధపడుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌, మాలీవుడ్‌ అనే తేడా లేకుండా అనేకమంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కొందరు మృత్యువాత పడ్డవాళ్లు కూడా ఉండటం విచారకరం. ఇప్పుడు సంయుక్త హెగ్డే పేరెంట్స్ సురక్షితంగా బయటపడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. 

ఇక నిఖిల్‌ హీరోగా నటించిన `కిర్రాక్‌పార్టీ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సంయుక్త హెగ్డే. దీంతోపాటు `కోమలి`, `వాచ్‌మ్యాన్‌`, `పప్సీ` వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం తమిళంలో `తీల్‌`, కన్నడలో `థుర్తు నిర్గమనా` చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల పార్క్ లో పొట్టి డ్రెస్సులు వేసుకుని జాగింగ్‌ చేస్తున్నారని ఓ మహిళా నాయకురాలు సంయుక్త హెగ్డేపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె దిగొచ్చి క్షమాపణలు చెప్పారు.