సమంత గుర్రమెక్కింది. అవును..  గుర్రం స్వారీ చేసుకుంటూ.. సమంత తన ఫోటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏం రాసిందంటే..?  

అనారోగ్యంతో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారు.. అనారోగ్యం కారణంగా కొంతకాలం పాటు ఇంటికే పరిమితమైన హీరోయిన్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కోలుకోవడమే కాదు సమంత కోలుకుని షూటింగ్ లకు కూడా హాజరవుతున్నారు. మయోసైటిస్ సమస్య తో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్.. ఇంట్లోనే ఉంటూ.. ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్న బ్యూటీ.. తన సినిమాలపై దృష్టి పెట్టింది.

బాలీవుడ్ లో సినిమాలపై ఫోకస్ చేసింది సమంత. వరుణ్ ధావన్ తో కలిసి ఆమె నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ సెట్ లో సమంత జాయిన్ అయ్యారు. అంతే కాదు టాలీవుడ్ లో సమంత .. విజయ్ దేవరకొండ జతగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ కూ హాజరుకానున్నట్లు ప్రకటించింది. ఇక ఈ విషయం తెలిసిన సామ్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ అయ్యింది. తన ప్రతీమూమెంట్ ను ఫ్యాన్స్ తో పంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సమంత తన ఇన్ స్టాలో లెటేస్ట్ ఫోటో షేర్ చేశారు. 

ఈ ఫోటోలో గుర్రంపై స్వారీ చేస్తున్న ఫొటోకు ది బ్యూటీ అండ్ ది బీస్ట్.. యూఆర్ బోత్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది శామ్. ఈ ఫోటోను సమంత తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. ఇక ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటో పై సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. సమంత పోస్ట్ పై తోటి హీరోయిన్లు రాశి ఖన్నా, ప్రగ్యా జైస్వాల్ స్పందించారు. సమంత ఫొటోకు లవ్ అండ్ ఫైర్ ఎమోజీలను కామెంట్ బాక్స్ జత చేశారు. 

ఇక ప్రస్తుతం సామ్ ఖుషి సినిమాతో పాటు సిటాడెల్ సినిమాలలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాకు శివ నిర్వాణ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన శాకుంతలం సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేసింది.