Asianet News TeluguAsianet News Telugu

Sai Pallavi:ఇక తగ్గేది లే.. దూకుడు పెంచిన సాయి పల్లవి..

ఈమధ్య జోరు తగ్గించిన హీరోయిన్ సాయి పల్లవి... మళ్లీ జోరు పెంచబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగులోఆమె సినిమా చేసి చాలా కాలం అవుతోంది. తాజాగా ఆమె మళ్లీ యాక్టీవ్ అవుతున్నట్టు సమాచారం. 
 

Heroine Sai Pallavi Movie Updates in Tollywood JMS
Author
First Published Nov 11, 2023, 4:37 PM IST | Last Updated Nov 11, 2023, 4:37 PM IST

సౌత్ లో మోస్ట్ వాంటెంట్ హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. స్కిన్ షో చేయదు... రొమాంటిక్ సీన్స్ లో నటించదు,మరీ పొట్టి బట్టలు వేసుకోదు..అయినా సరే సాయి పల్లవి క్రేజ్ మాత్రం ఓరేంజ్ లో ఉంటుంది. ఆమె కోసం క్యూ కడుతుంటారు మేకర్స్.. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ ఈ భామ. అద్భుత నటన, ఆకట్టుకునే రూపం ఈ చిన్నదాని సొంతం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సాయి పల్లవి. అప్పటి నుంచి ఆమెను వరుస ఆఫర్లు వరించాయి. 

సాయి పల్లవి హీరోయిన్ గా పరిచయం అయ్యింది మాత్రం మలయాళంలో ప్రేమమ్ సినిమాతో. ఈ సినిమాఇటు తెలుగు ప్రేక్షకుల ను కూడా అలరించింది. తమిళంలో సినిమాలు చేసతూనే.. తెలుగులోకూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది బ్యూటీ. కాని సెలక్టెడ్ గా సినిమాలు చేసే సాయి పల్లవి.. స్టార్ హీరోల సరసన ఆఫర్లు వచ్చినా.. కథ విషయంలో సంతృప్తి చెందక రిజెక్ట్ చేసింది. కథలో హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే సినిమా చేస్తుంది సాయి పల్లవి. అలా కాకుండా.. హీరోయిన్ ను గ్లామర్ పీస్ గా మాత్రమే చూసే సినిమాల్లో ఎంత పెద్ద స్టార్ హీరో పక్కన అవకాశం వచ్చినా రిజెక్ట్ చేస్తుంటుంది బ్యూటీ. 

తెలుగులో ఈ సాయి పల్లవి చేసిన సినిమాలన్నీ దాదాపు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ భామ. గతకొంతకాలంగా సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగులో ఈ చిన్నది చివరిగా రానా హీరోగా నటించిన విరాటపర్వం సినిమాలో కనిపించింది.అలాగే తమిళ్ లో గార్గి సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఆతర్వాత సాయి పల్లవి ఎక్కడా కనిపించలేదు. సైలెంట్ అయ్యింది. 

చాలా కాలంగా సాయి పల్లవి నుంచి ఆమె నుంచి కొత్త సినిమా ఏది రాలేదు. దాంతో ఈ అమ్మడు గురించి రకరకాల వార్తలు వచ్చాయి. సినిమాలు మానేసిందని, డాక్టర్స్ గా సెటిల్ కాబోతుందని వార్తలు వచ్చాయి. కొంతమంది ఏకంగా పెళ్లి చేసుకోనుందని కూడా ప్రచారం చేశారు.ఇక ఇప్పుడు సాయి పల్లవి స్పీడ్ పెంచేసింది. తమిళ్ లో ఓ సినిమా చేస్తుంది. శివ కార్తికేయన్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది సాయి పల్లవి.

అలాగే తెలుగులోనూ ఓ సినిమా చేస్తుందని తెలుస్తోంది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేశారని తెలుస్తోంది. అంతకు ముందు ఈ ఇద్దరు కలిసి లవ్ స్టోరీ అనే సినిమా చేశారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరోసారి సందడి చేయనున్నారని తెలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios