సాయి పల్లవి ఎక్కడ ఉంటే కసందడి అక్కడ ఉంటుంది. ఆడియన్స్ కూడా సాయిపల్లవి కనిపిస్తే  చాలు తెగ ఆనందపడిపోతుంటారు. ఇక రీసెంట్ గా ఓ థియేటర్ లో ఆమె సందడి చేసింది. ఆడియన్స్ నుంచి గ్రాండ్ వెల్కమ్  కూడా లభించింది. 


సినిమాల విషయంలో సాయి పల్లవి రూటు వేరు. ఎంతటి స్టార్ తో సినిమా అయినా సరే.. కథలో తనకు పెర్ఫామెన్స్ స్కోప్ ఉంటేనే చేస్తుంది. అలా ఉన్న విమెన్ సెంట్రిక్ మూవీ అయినా సరే ఒకే చెప్పేస్తుంది. సెలెక్టెడ్ గా సినిమాలు చేయడం. మంచి సినిమాలు చేయడం వల్ల సాయి పల్లవి ఇమేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఎన్ని అవకాశాలు వచ్చిన సాయిపల్లవి మాత్రం మంచి పాత్రలు ఉన్న సినిమాలు మాత్రమే ఎంచుకుంటుంది.

ఇక సాయి పల్లవి నచ్చిమెచ్చి నటించిన సినిమా గార్గి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి స్పందన వస్తోంది. ఈ నెల 15న ఈ సినిమా విడుదల కాగా.. విమర్షకులు ప్రశంసలు కూడా అందుకుంటుంది సినిమా. ఇక ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు సాయి పల్లవి స్వయంగా వెళ్లి సందడి చేస్తోంది. చెన్నై, హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లను సాయిపల్లవి విజిట్ చేసింది. అంతే కాదు కొంత టైమ్ వరకూ ఆడయిన్స్ తో కలిసి సినిమా చూస్తూ.. వారి రెస్పాన్స్ ను గమనించింది. వారితో పాటు కేరింతలు కొడుతూ.. మాట్లాడుతూ హడావిడి చేసింది. 

Scroll to load tweet…

ఇక సాయి పల్లవి అంటే చాలు స్టార్ హీరోకు కూడా లేనంతగా ఫ్యాన్స్ సందడి ఉంటుంది. ఆమె అంటే ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు కదా.. సాయి వస్తోందని తెలిసి.. థియేటర్లలో అభిమానులు ఈలలు వేస్తూ సాయి పల్లవికి స్వాగతం పలికారు. తెగ హడావిడి చేశారు. ఘనంగా ఆమెకు స్వాగతం తెలిపారు. ఇక ఆమె వెంట దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ కూడా ఉన్నారు. 

Scroll to load tweet…

గార్గి సినిమా సమాజానికి మంచి మెసేజ్ ఇస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలపై లైంగిక దాడులు కథాంశంగా చేసుకుని సామాజిక చిత్రాన్ని తెరకెక్కించినందుకు డైరెక్టర్ గౌతమ్ తో పాటు సాయి పల్లవికి అన్ని భాషల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈసినిమా చూసిన తమిళ స్టార్ హీరో సూర్య.. ఉదయనిధి స్టాలిన్ మెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత గొప్పగా రచించి, గొప్పగా రూపొందించిన సినిమాగా ఇది గుర్తుండిపోతుందన్నారు. వారి సలహామేరకే అన్ని భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు.