హీరోయిన్ సదా బోరున ఏడ్చారు. కన్నీటి పర్యంతం అయ్యారు. తనలో బాధను ఒకేసారి బయటకు చూపించారు. సదా అంత ఎమోషనల్ అవ్వడానికి కారణం అడవి శేష్. అవును అడవి శేష్ వల్లే సదా వెక్కి వెక్కి ఏడ్చారు. ఇంతకీ ఏమైయ్యిందంటే..?
జయం సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్ గా సౌత్ ను ఒక ఊపు ఊపిన సదా.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ టీవీ షోలు చేసుకుంటూ... యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ థియేటర్‌లో కన్నీళ్లు పెట్టుకుంది. తన మనసుకు ఆ సినిమా ఎంతగానో చేరువైందని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఆమె మేజర్ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన.. మేజర్ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుని, అద్భుతమైన కలెక్షన్లు కూడా రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె సినిమా చూస్తూ.. కన్నీళ్ళ పర్యంతం అయ్యింది. ఇది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
ఇక సినిమా చూడడం పూర్తయిన తర్వాత సదా సినిమా మీద తన అభిప్రాయాన్ని పంచుకున్నది. స్వతహాగా తాను ముంబైలోనే ఉంటాను కాబట్టి, ఈ ఉగ్రదాడులు జరిగిన సమయంలో కూడా ముంబైలోనే ఉన్నాను, ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే అప్పుడు ఏదైతే ఒక ఒక ఫీలింగ్ తనకు కలిగిందో... సినిమా చూస్తున్నపుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది అని చెప్పుకొచ్చింది.. ఇక హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క అద్భుతమైన ప్రదర్శన కనపరిచి, సినిమాను అద్భుతంగా రూపొందించారని ఆమె పేర్కొన్నారు.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో ఆఫీసర్ అయిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన ప్రాణాలకు తెగించి ముంబై ఉగ్రదాడులలో అనేక మందిని కాపాడారు. అయితే అదే సమయంలో ఆయన ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి విని ఆయన గురించి తెలుసుకుని ఎలా అయినా ఆయన గురించి సినిమా చేసి భారతీయులందరికీ ఆయన తెలియజేయాలని భావించిన అడివి శేష్, చాలా కాలం రీసెర్చ్ చేసి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల వద్ద పర్మిషన్ తీసుకుని మరీ.. సినిమాను మన ముందుకు తీసుకు వచ్చారు.
