Asianet News TeluguAsianet News Telugu

నిర్మాత కొడుకుతో హీరోయిన్ ఎఫైర్!

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా పేరు గాంచిన ఓ నిర్మాత తనయుడు ఇప్పుడు హీరోయిన్ తో ఎఫైర్ సాగించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత కొడుకు కావడంతో ఇతడు కూడా సహా నిర్మాతగా, సమర్పకుడిగా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి

Heroine's Romance With Producer's Son
Author
Hyderabad, First Published Sep 18, 2018, 12:39 PM IST

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా పేరు గాంచిన ఓ నిర్మాత తనయుడు ఇప్పుడు హీరోయిన్ తో ఎఫైర్ సాగించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత కొడుకు కావడంతో ఇతడు కూడా సహా నిర్మాతగా, సమర్పకుడిగా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

పేరుకి తండ్రి సినిమా అయినా.. ఆ వ్యవహారాలన్నీ ఇతడే దగ్గరుండి చూసుకుంటాడు. ఇప్పుడు రెండో బ్యానర్ స్థాపించి సినిమాలు కూడా తీస్తున్నాడు. ఇప్పుడీ యువ నిర్మాత ఓ హీరోయిన్ వలలో పడినట్లు టాక్. సదరు హీరోయిన్ ఈ సంస్థతో ఓ సినిమా చేసింది. అప్పటి నుండి హీరోయిన్ కి, నిర్మాత తనయుడికి మధ్య అనుబంధం మొదలైంది.

ఆ సినిమా విడుదలై ఫ్లాప్ కూడా అయింది. అయినప్పటికీ హీరోయిన్ తో నిర్మాత కొడుకు రిలేషన్ మాత్రం కొనసాగుతూనే ఉంది. గతంలో ఈ హీరోయిన్ కి అగ్ర దర్శకుడికి ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆమె మాత్రం ప్రస్తుతానికి నిర్మాత కొడుకుతో ఎఫైర్ సాగిస్తుంది.

ఈమె కోసం హైదరాబాద్ లోని ఓ ఖరీదైన హోటల్ లో నిర్మాత కొడుకు ఓ సూట్ ఎప్పటికీ బుక్ చేసే ఉంచాడట. ఆ బిల్లులు మొత్తం కూడా అతడే కడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తన కొడుకు హీరోయిన్ వెంట పడుతున్నాడని తెలిసి ఆ అగ్ర నిర్మాత బయటకి చెప్పుకోలేక తనలో తనే బాధ పడుతున్నాడని సమాచారం. సదరు హీరోయిన్ కి మాత్రం ఎన్ని ఫ్లాపులు వస్తున్నా.. అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios