ఇలాంటి వీడియో అప్పుడు వైరల్ అయితే నా పరిస్థితి ఏంటి?... నోరు విప్పిన రష్మిక మందాన!
తన పేరిట వైరల్ అవుతున్న ఓ ఫేక్ వీడియోపై రష్మిక మందాన స్పందించారు. ఆమె కీలక కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం వెల్లడించారు.

రష్మిక మందాన పేరున ఓ బోల్డ్ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో నిజమని నమ్మిన కొందరు నెటిజెన్స్ రష్మికపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్ట్ ఒరిజినల్ వీడియో పోస్ట్ చేశారు. ఇలాంటి ఫేక్ డీప్ వీడియోలను కట్టడి చేసేలా చట్టాలు మార్చాలని కామెంట్ చేశాడు. సదరు జర్నలిస్ట్ కామెంట్స్ పై అమితాబ్ స్వయంగా స్పందించారు. అవును లీగల్ బాడీస్ వెంటనే స్పందించాల్సిన సీరియస్ కేసు ఇది అని... కామెంట్ చేశారు.
భారతీయ మూలాలున్న బ్రిటన్ యువతి జరా పటేల్ తన ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోను డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అచ్చు రష్మిక ముఖంలా సాంకేతిక పరిజ్ఞానంతో మార్ప్ చేశారు. అమితాబ్ వంటి నటులు ఖండించిన నేపథ్యంలో ఈ మేటర్ ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయ్యింది.
తన ఫేక్ వీడియో పై స్పందించిన రష్మిక కీలక కామెంట్స్ చేసింది. ''నా పేరున వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి రావడం బాధాకరం. ఇలాంటి సంఘటనలు నన్నే కాదు ప్రతి ఒక్కరినీ నిజంగా భయానికి గురి చేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం చేస్తున్నారు. ఒక మహిళగా, నటిగా నాకు మద్దతుగా ఉంటున్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ కి నా కృతఙ్ఞతలు. నేను స్కూల్, కాలేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వీడియో వైరల్ అయితే నేను ఎలా ఎదుర్కోగలను. దీన్ని మనం ఒక సమూహంగా ఖండించాలి. కట్టడి చేయాలి'' అని రష్మిక ట్వీట్ చేసింది.
రష్మికకు అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు రష్మిక టాప్ స్టార్ గా ఉంది. పుష్ప 2, యానిమల్ వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో రష్మిక నటిస్తుంది. రైన్ బో, గర్ల్ ఫ్రెండ్ టైటిల్ తో లేడీ ఓరియెంట్ చిత్రాల్లో నటిస్తుంది. రష్మిక నేషనల్ క్రష్ గా పేరుగాంచింది.