Asianet News TeluguAsianet News Telugu

ఆమె కోసం ఆదిల్ నన్ను వదిలేశాడు... భర్తపై రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు!


బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త ఆదిల్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మరోసారి మీడియా వేదికగా ఆదిల్ తో పాటు తను అనే మహిళపై రాఖీ సావంత్ ఫైర్ అయ్యారు. 
 

heroine rakhi sawant once again made sensational comments on adil khan
Author
First Published Feb 7, 2023, 12:05 PM IST

గత ఏడాది రాఖీ సావంత్ నటుడు ఆదిల్ ఖాన్ ని వివాహం చేసుకున్నారు. రాఖీ సావంత్ కి ఇది రెండో వివాహం. ఆదిత్ తో ఆమె వివాహం బంధం మొదలై సంవత్సరం కాకుండానే వివాదాలు తలెత్తాయి. తనకు తెలియకుండా ఆదిల్ మరొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడంటూ ఆమె ఆరోపిస్తున్నారు. ఇటీవల మీడియా ముందు ఆదిల్ మీద ఆమె ఫైర్ అయ్యారు. ఆదిల్ పెద్ద అబద్దాల కోరు. ఒక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. నాకు తెలిసి నిలదీస్తే ఇకపై ఆమెతో మాట్లాడను. నంబర్ బ్లాక్ చేస్తున్నానని చెప్పాడు. ఖురాన్ మీద ఓట్టేసి ఆ అమ్మాయిని వదిలేస్తానని చెప్పాడు. 

కానీ తన ప్రామిస్ నిలబెట్టుకోలేదు. ఇంకా తనతో ఎఫైర్ నడుపుతున్నాడు. ఆ అమ్మాయి ఆదిల్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆమె వద్ద ఇతని ఛండాలపు వీడియోలు ఉన్నాయి. అవి బయటపెడతానని ఆదిల్ ని భయపెడుతుంది. అతను మీడియా అటెన్షన్ కోరుకుంటున్నాడు. ఈ వివాదాలతో పాప్యులర్ కావాలనుకుంటున్నాడు. దయచేసి ఆదిల్ ఖాన్ ని మీడియా వాళ్ళు ఎవరూ ఇంటర్వ్యూ చేయవద్దు... అంటూ రాఖీ ఆవేదన చెందారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by India Forums (@indiaforums)

తాజాగా మరోసారి కీలక ఆరోపణలు చేశారు. ఈసారి ఆమె ఆదిల్ తో సంబంధం పెట్టుకుంది అంటూ ఆరోపిస్తున్న అమ్మాయి పేరు బయటపెట్టారు. ఆమెకు కూడా వార్నింగ్ ఇచ్చారు. రాఖీ ఆరోపణల ప్రకారం తను అనే అమ్మాయి ఆదిల్ తో ఎఫైర్ పెట్టుకుంది. ''తను నువ్వు నా భర్తను నా నుండి లాక్కున్నావు. నాలాగే నువ్వు కూడా బాధపడే రోజు వస్తుంది. అది నేను చూడాలనుకుంటున్నాను. ఆదిల్ తో ఒక ఏడాది పాటు జర్నీ చేసిన అమ్మాయిగా చెబుతున్నా నీకు బాధలు తప్పవు. నువ్వు నన్ను తిట్టిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి'' అని రాఖీ సావంత్ అన్నారు. 

నేను కష్టపడి పరిశ్రమలో ఎదిగాను. నా డబ్బులు మొత్తం ఆదిల్ లాగేసుకున్నాడు. మానసికంగా, శారీరకంగా నన్ను వేధించాడని ఆదిల్ మీద ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో ఆదిల్ తో రాఖీ సావంత్ బంధం ముగిసినట్లనిపిస్తుంది. రాఖీ సావంత్ బాలీవుడ్ ఐటమ్ గర్ల్ గా పాపులర్ అయ్యారు. ఆమె అనేక హిట్ సాంగ్స్ లో నటించారు. తెలుగులో 6 టీన్స్ మూవీలో రాఖీ సావంత్ నటించడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios