హీరోయిన్ పూర్ణ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. దానికి ఓ కారణం ఉంది. తొమ్మిదో నెలలో ఫ్యామిలీ మెంబర్స్ ఆమెకు ట్రీట్ ఇచ్చారట.


నటి పూర్ణ తల్లితనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆమెకు ఇప్పుడు తొమ్మిదో నెల. కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. తొమ్మిది నెలల గర్భవతి అయిన పూర్ణకు తొమ్మిది రకాల ఇష్టమైన వంటకాలు చేసి తినిపించారట. ఆమె కోసం తల్లి, సిస్టర్ చేసిన వంటకాలు చూపుతూ వీడియో చేశారు. ఆ వంటకాలను పూర్ణకు భర్త అసిఫ్ అలీ ప్రేమగా తినిపించారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో చెప్పుకుని పూర్ణ గొప్పగా ఫీలైంది.

కాగా దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పూర్ణ రహస్య వివాహం చేసుకుంది. నిశ్చితార్థం గురించి చెప్పిన పూర్ణ పెళ్లి మేటర్ ఎవరికీ చెప్పలేదు. అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటే... ఆల్రెడీ జరిగిపోయిందని సడన్ షాక్ ఇచ్చింది. ఓ సందర్భంలో మాట్లాడుతూ... 2022 మే 31న షానిద్ తో నాకు నిశ్చితార్థం జరిగింది. ఆ నెక్స్ట్ మంత్ జూన్ 12న దుబాయ్ లో వివాహం జరిగింది. కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించామని పూర్ణ వివరణ ఇచ్చారు. ఇక ఇండియాలో ఉన్న బంధువులు, సన్నిహితులు, స్నేహితుల కోసం కేరళలో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ చెప్పుకొచ్చారు. కానీ అది జరగలేదు. 

View post on Instagram

భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు. బుల్లితెరపై, సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు.. గత ఏడాది పూర్ణ నటించిన తీస్ మార్ ఖాన్ విడుదలైంది. అలాగే విశితిరన్ అనే ఒక తమిళ చిత్రం చేశారు. ఇక పూర్ణ కెరీర్ పరిశీలిస్తే ఆమెకు మంచి ఆరంభం లభించింది. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని కారణాల వలన పలు ఆఫర్స్ వదులుకున్నాను, అది నా కెరీర్ కి మైనస్ అయ్యిందని పూర్ణ గతంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా దాదాపు ఫేడ్ అవుటైన పూర్ణ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో పూర్ణ ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కించుకున్నారు. అలాగే టెలివిజన్ షోస్ లో తన మార్కు ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తున్నారు.