Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్... నాని తో జతకట్టబోతున్న పూజా హెగ్డే.. నిజమెంత..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఊహించని కాంబినేషన్లు సందడి చేస్తూ వస్తున్నాయి. అసలు ఆ కాంబో లో సినిమా ఆలోచనే ఆడియన్స లో ఉండకపోవచ్చు అలాంటి కాంబినేషన్లు తెరపై సందడి చేస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ లో అలాంటి జంటే సినిమా చేయబోతున్నారట. 

Heroine Pooja Hegde Movie With Natural Star Nani JMS
Author
First Published Dec 8, 2023, 12:56 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో అనుకోని కాంబినేషన్లు  సందడి చేస్తూ వస్తున్నాయి. ఉదాహరణకు బాలయ్యతో కాజల్ సినిమా చేయలేదుఅనుకున్నారు.. భగవంత్ కేసరి సినిమాతో ఆడియన్స్ ముచ్చట తీరిపోయింది.. ఇక బాలయ్యతో త్రిష కూడా లైన్ లో ఉందంటున్నారు. అలానే కొన్ని అనుకోని కాంబోల హడావిడి టాలీవుడ్ లో పెరిగిపోయింది. ఈక్రమంలోనే అస్సలుఎవరూ ఊహికుండా.. నేచురల్ స్టార్ నాని జోడీగా.. బుట్ట బొమ్మ పూజా హెగ్డే జతకట్టబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. 

న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. ప్రయోగాలు చేస్తూ.. ఏడాదికి కనీసం రెండునుంచి మూడు సినిమాలు చేస్తూ.. హైలెట్ అవుతున్నారు. అంతే కాదు కొత్త దర్శకులకు ఛాన్స్ లు ఇస్తూ.. వారి టాలెంట్ ను టాలీవుడ్ కు పరిచయంచేస్తున్నాడు నాని ఈక్రమంలో ఆయన రీసెంట్ గా హాయ్ నాన్న సినిమాతో వచ్చి మంచి హిట్ ను సాధించాడు. ఇక నాని ఖాతాలో మరో మూడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో నాని గతంలో అంటే సుందరానికి సినిమాను డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయతో గుర్తుందా శనివారం సినిమా చేస్తున్నాడు. ఇక ఆతరువాత కూడా మరో రెండుసినిమాలు ఉన్నాయట. 

 ఈక్రమంలోనే నేచురల్ స్టార్  నాని... పూజాహెగ్డే కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని వార్తలు హైలెట్ అవుతున్నాయి.  వరుస ఫ్లాపుల వల్ల ఈ మధ్య కాలంలో పూజాహెగ్డేకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ఆమెను ఐరన్ లెగ్ అనే టాగ్ తో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.  ఈక్రమంలో తనను తాను నిరూపించుకునేందుకు పూజా హెగ్డేకు మరో ఛాన్స్ దక్కిందని  అంటున్నారు. ఈ విషయంలో  ఆమె ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.

నాని సినిమాలో చేసిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా..? తెలిస్తే షాక్ అవుతారు.

సిబి చక్రవర్తి డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా సెలక్ట్ చేసినట్టు సమాచారం.  డాన్ సినిమాతో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న సిబి చక్రవర్తికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాన్ అక్కడి ఆడియన్స్ ను బాగా అలరించింది. అయితే ప్రస్తుతం నానితోఈ దర్శకుడు తెరకెక్కించే సినిమా పక్కా మాస్ గా ఉంటుందటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios