Asianet News TeluguAsianet News Telugu

Payal Rajput: సెల్ఫీ అడిగిన అభిమానికి హగ్ ఇచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..!


పాయల్ రాజ్ పుత్ అభిమానికి హగ్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో పాయల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. 
 

heroine payal rajput hugs a fan who asked for selfie ksr
Author
First Published Mar 29, 2023, 3:44 PM IST

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ చేసిన పనికి ఓ  అభిమాని షాక్ అయ్యాడు. ఊహించని పరిణామంతో కంగుతిన్నాడు. జస్ట్ సెల్ఫీ కోసం వెళితే హగ్ ఇచ్చింది. ఈ వీడియో వైరల్ అవుతుంది. పాయల్ పబ్లిక్ లో సందడి చేశారు. దీంతో అక్కడున్న అభిమానులు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. వాళ్ళను నిరాశపరచకుండా పాయల్ సెల్ఫీలకు ఫోజిచ్చారు. ఓ అభిమాని మీద పాయల్ చేయి వేసింది. అంతటితో ఆగకుండా స్మాల్ హగ్ ఇచ్చింది. దాంతో ఆ అభిమాని ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ వీడియో పాయల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. పాయల్ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించారు. 

 జయాపజయాలతో సంబంధం లేకుండా పాయల్ కి భారీ క్రేజ్ ఉంది. ఒకప్పటి ఈ సీరియల్ నటి ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2018 లో విడుదలైన ఆర్ఎక్స్ 100 మూవీ సంచలన విజయం నమోదు చేసింది. హీరోయిన్ పాయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఇది ఓ న్యూ ఏజ్ లవ్ డ్రామా అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చినా పాయల్ కి బ్రేక్ రాలేదు. ఎందుకో దర్శక నిర్మాతలు ఆమెను పట్టించుకోలేదు. పాయల్ జతకట్టిన పెద్ద హీరోల లిస్ట్ లో వెంకటేష్, రవితేజ మాత్రమే ఉన్నారు. వెంకీ మామ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేయగా... డిస్కో రాజా ప్లాప్ అయ్యింది. ఆ దెబ్బతో పాయల్ కెరీర్ తిరోగమనం పట్టింది. 


చిత్ర పరిశ్రమలో విజయాల ఆధారంగానే అవకాశాలు వస్తాయి. అత్యంత తక్కువ సక్సెస్ రేట్ కలిగిన పాయల్ ని మెల్లగా దర్శక నిర్మాతలు దూరం పెట్టారు. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తున్న పాయల్ కి సరైన బ్రేక్ రావడం లేదు.పాయల్ లేటెస్ట్ మూవీ  మాయా పేటిక థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం మొబైల్ వినియోగం ఎక్కువ కావడం వలన ఏర్పడే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దర్శకుడు రమేష్ రాపర్తి తెరకెక్కిస్తున్నారు. సునీల్, హిమజ, పృథ్వి, శ్రీనివాసరెడ్డి కీలక రోల్స్ చేస్తున్నారు. 

గత ఏడాది పాయల్ నటించిన తీస్ మార్ ఖాన్ ఆగస్టులో విడుదలైంది. ఆది హీరోగా నటించిన ఈ మూవీలో పాయల్ రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. కంటెంట్ పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా ఆడలేదు. అలాగే మంచు విష్ణుకు జంటగా జిన్నా చిత్రం చేసింది. ఆ మూవీ మొత్తంగా డిజాస్టర్ అయ్యింది.మరోవైపు వెబ్ మూవీస్ లో నటిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విపరీతంగా అవకాశాలు దక్కుతుండగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే కన్నడ, తమిళ భాషల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios