నయనతార తన కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది. రీసెంట్ గా పెళ్ళి చేసుకున్న సీనియర్ హీరోయిన్..75వ సినిమా మైలురాయికి దగ్గరగా ఉంది.
నయనతార ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన ముహూర్తం బాగున్నట్టుంది.కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటివరకూ ఆమె వెనుదిరిగిచూసుకోలేదు. అంతే కాదు అవకాశాల కోసం ఆమె ఎవ్పుడు ఎదురు చూడలేదు, ఎవరికి అడగలేదు కూడా.. మరో వైపు ఆమె చేసిన సినిమాల వల్ల సక్సెస్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్న రోజులు కూడా లేవు.
ఒక వైపున స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూనే.. మరోవైపు విమెన్ సెంట్రిక్ మూవీస్ తో అలరిస్తుంది నయనతార. అంతే కాదు సౌత్ లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా సాధించింది ఈ హీరోయిన్. సాధారణంగా 30 ఏళ్లు దాటితే.. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతాయి. కొంత మంది తారులు కనిపించకుండా పోతారు. నయన్ మాత్రం అందుకు బిన్నం.
హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన నయనతార.. ఆతరువాత కూడా తన హవా కొనసాగిస్తున్నారు. ఏ స్టార్ హీరోయిన్ తీసుకోని రెమ్యూనరేషన్ తీసుకుంటూ.. కెరీర్ లో దూసుకుపోతోంది. సినిమాకు 6 కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందట స్టార్ బ్యూటీ.
చాలా స్పీడ్ గా కెరియర్ ను పరుగులు తీయించిన హీరోయిన్లలో నయనతార ముందు వరుసలో ఉంది. ఇక ఇండస్ట్రీలో కూడా నయనతార స్థాయిలో సక్సెస్ రేటు చూసిన హీరోయిన్లు కూడా ఎవరూ లేరు. అలాంటి నయనతార మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి రెడీ అవుతోంది.
కెరియర్ పరంగా నయనతారకు 75వ సినిమా తెరకెక్కిన ఈ సినిమాని జీ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన నీలేశ్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరో జై , సత్యరాజ్ ఇంపార్టెంట్ పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు అనౌన్స్ చేయబోతున్నారు.
