Asianet News TeluguAsianet News Telugu

మోకాళ్లపై నడుచుకుంటూ.. తిరుమల కొండ ఎక్కిన హీరోయిన్, వైరల్ అవుతున్న వీడియో

తిరుమల దర్శనం అంటే సామాన్యులకు అంత ఆశామాషి కాదు. కాని విఐపీలు మాత్రం నేరుగా దర్శించుకునే ఛాన్స్ ఉంది. కాని ఒక సినిమా హీరోయిన్ అయ్యి ఉండి.. సామాన్యురాలి వలే.. తిరుమల కొండ ఎక్కింది హీరోయిన్, అది కూడా మోకాళ్లతో నడుచుకుంటూ ఎక్కి శ్రీవారి దర్శనం చేసుకుంంది.. ఇంతకీ ఎవరా స్టార్..? 

Heroine Nandini rai visit tirumala through knee walk
Author
First Published Oct 19, 2022, 5:02 PM IST


తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనానికి రోజు వేలల్లో.. లక్షల్లో భక్తులు వస్తుంటారు. అందులో చాలా మంది విఐపీ భక్తులు ఉంటారు. సామాన్యులు ఎలా వెళ్ళినా.. సెలబ్రిటీల్ మాత్రం విఐపీ సేవల్లో దర్శనాలు చేసుకుంటుంటారు. అంతే కాని సామాన్యుల ఎలా వెళ్తున్నారు.. వారిలా మనం కూడా వెళ్ధాం అని చాలా మంది అనుకోరు. కాని చిన్న స్టారో.. పెద్ద స్టారో తరువాత సంగతి.. ఓ సినిమా హీరోయిన్ మాత్రం సామాన్య భక్తురాలిలా శ్రీవారి మెట్లు ఎక్కి.. ఆయన దర్శనం చేసుకుంది. ఇంతకీ ఆవిడ ఎవరో కాదు హీరోయిన్ నందినీ రాయ్. 

స్టార్ హీరోయిన్ కాకపోయినా.. జనాలు తెలిసిన హీరోయిన్ చిన్న సినిమాలు చేసినా.. బిగ్ బాస్ లాంటి షోల ద్వారా పాపులారిటీ సాధించిన భ్యూటీ.. రీసెంట్ గా శ్రీవారిని దర్శించుకుంది. అది కూడా మామూలు నడక కాదండోయ్.. మోకాళ్లపైన నడిచి మరీ.. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది నందిని. సెలబ్రిటీలు కాలినడకన శ్రీవారి దర్శనం చేసుకోవడం అరుదు. అందులోను మోకాళ్ల మీద నడిచి దర్శనం చేసుకున్న స్టార్లు ఇంత వరకూ లేదు. ఈ విషయంలో నందనీ రాయ్ స్పెషల్ గా నిలిచింది. 

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో నందిని రాయ్ కంటెస్టెంట్ గా ఉంది. అంతే కాదు టాలీవుడ్ లో పలు సినిమాలలో కూడా నటించి మెప్పించింది బ్యూటీ. తెలుగులో సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాళ్లు ,  సినిమాలు చేసిన నందినీ.. ఆతరువాత పంచతంత్ర కథలు, శివరంజనీ లాంటి చిన్న సినిమాలు కూడా చేసింది. అయితే ఆమెకు టాలీవుడ్ లో రావల్సిన గుర్తింపు రాలేదు. ఇక రీసెంట్ గా తిరుమల దర్శనం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో శేర్ చేసుకుంది.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nandini Rai (@nandini.rai)

ఎంతో కష్టపడి మెట్లు మోకాళ్లపై ఎక్కాను. కాని ఆ కష్టాన్ని మర్చిపోయేలా మధురానుభూతి  దర్శనం ద్వారా పోందానంటూ పోస్ట్ చేసింది నందిని. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నందినీ రాయ్ చేసిన పనికి చాలామందశభాశ్ అంటున్నారు. కాస్త ఇమేజ్ ఉన్నా సరే.. వీఐపీల ముసుగు వేసుకుని ఫ్రీ దర్శనాలు వెతుకుంటూ వస్తున్నఈ రోజుల్లో చాలా సింపులు గా.. అది కూడా మోకాళ్లపై నడచుకుంటూ.. నందినీ రాయ్ శ్రీవారి దర్శనం చేసుకోండం చాలా సంతోషంగా ఉంది అంటున్నారు నెటిజన్లు. 

Follow Us:
Download App:
  • android
  • ios