మంజిమా మోహన్ తన లవర్ ని పరిచయం చేసింది. కోలీవుడ్ యువ హీరో గౌతమ్ కార్తీక్ ని ప్రేమిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పరస్పరం వీరు ఈ విషయాన్ని వెల్లడించారు.  

కోలీవుడ్ యువ జంట మంజిమా మోహన్-గౌతమ్ కార్తీక్ తాము ప్రేమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. గౌతమ్ తో రొమాంటిక్ గా ఫోజులిచ్చిన మంజిమా ఆ ఫోటోలు పోస్ట్ చేశారు. అలాగే లవ్ సింబల్ కామెంట్ చేశారు. మరోవైపు గౌతమ్ సైతం తన ట్విట్టర్ లో సేమ్ పోస్ట్ చేశాడు. మంజిమా-గౌతమ్ ప్రేమ ప్రకటనపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

వీరిద్దరూ స్టార్ కిడ్స్ కావడం విశేషం. గౌతమ్ 'అభినందన' మూవీ ఫేమ్ కార్తీక్ కుమారుడు.గౌతమ్ ని మణిరత్నం కడల్ మూవీతో హీరోగా పరిచయం చేశాడు. కోలీవుడ్ లో గౌతమ్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక మంజిమా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్, డాన్సర్ కళామన్డలం గిరిజ కుమార్తె. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంజిమా మలయాళంలో అనేక చిత్రాలు చేశారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా 2016లో విడుదలైన అచ్చం యన్బదు మదమైయడ మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది.

Scroll to load tweet…

ఆ చిత్ర తెలుగు వర్షన్ సాహసం శ్వాసగా టైటిల్ తో నాగ చైతన్య చేశారు. తెలుగులో కూడా మంజిమా మోహన్ హీరోయిన్ గా చేశారు. ఏమాయ చేశావే కాంబినేషన్ లో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో అనుకున్న స్థాయిలో ఆడలేదు. అలాగే ఎన్టీఆర్ బయోపిక్స్ మహానాయకుడు, కథానాయకుడు చిత్రాల్లో నారా భువనేశ్వరి పాత్ర మంజిమా చేశారు. కాగా గౌతమ్ కార్తీక్-మంజిమా 2019లో విడుదలైన దేవరాట్టం అనే చిత్రంలో కలిసి నటించారు. ప్రస్తుతం మంజిమా, గౌతమ్ ప్రేమ వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.