హీరోయిన్ మాధవీలత బిగ్ బాస్ షోకి వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.  

బిగ్ బాస్ షోపై కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఓ వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హోస్ట్ నాగార్జున కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. బిగ్ బాస్ తెలుగు ఆపేయాలంటూ కేసులు కూడా వేశారు. తాజాగా హీరోయిన్ మాధవి లత బిగ్ బాస్ షోపై తనదైన ఆరోపణలు చేసింది. తన అభిప్రాయం వెల్లడిస్తూ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఓ పోస్ట్ పెట్టారు. 

''బిగ్ బాస్ 100% కమర్షియల్ షో. అక్కడకు సామాన్యులను పంపితే ఎవరూ దేకరు. అందుకే కామనర్స్ అనే కాన్సెప్ట్ వదిలేయండి. తెలియని ముఖాలను తీసుకుంటే టీఆర్పీ రాదు. అందుకే సెలెబ్రిటీలను తీసుకుంటారు. షో చూసే వాళ్ళు చూడండి. ఎవరిని షోలోకి తీసుకుంటే జనాలు చుస్తారో వాళ్లకు తెలుసు. చాలా మందిని ట్రై చేశారు. డబ్బులు కంటే ఇజ్జత్ ముఖ్యమని బై బై చెప్పేశారు. కాబట్టి ఉన్నవాళ్లతో అడ్జస్ట్ అవ్వండి. నన్ను చూడమని అడగొద్దు...'' అని కామెంట్ పోస్ట్ చేశారు. 

బిగ్ బాస్ షోకి వ్యతిరేకంగా మాధవీలత చేసిన కామెంట్స్ వైరల్ అవుతుంది. 2008లో విడుదలైన నచ్చావులే చిత్రంతో మాధవీలత పరిశ్రమలో అడుగుపెట్టింది. నచ్చావులే హిట్ కాగా.. నానికి జంటగా నటించిన స్నేహితుడు చిత్రం కూడా విజయం సాధించింది. 2015 తర్వాత ఆమె కెరీర్ నెమ్మదించింది. చివరిగా 2021లో మదురై మణికురువర్ అనే తమిళ చిత్రంలో నటించింది. మాధవీలత బీజేపీ పార్టీలో చేరారు.