సమంత బాటలో లావణ్య త్రిపాఠి!
సమంత మాదిరి లావణ్య త్రిపాఠి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆమె చేసిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
యూపీ బ్యూటీ లావణ్య త్రిపాఠి మెగా కోడలు అయిన విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్ ని లావణ్య పెళ్లి చేసుకుంది. గత ఏడాది నవంబర్ లో లావణ్య-వరుణ్ ల పెళ్లి ఇటలీ దేశంలో జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో పాటు పలువురు హాజరయ్యారు. లావణ్య, వరుణ్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు.
దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన మిస్టర్ మూవీలో వీరు జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఏళ్ల తరబడి వీరు రహస్యంగా ప్రేమించుకున్నారు. లావణ్య-వరుణ్ లవ్ లో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను వారు ఖండించారు. సడన్ గా గత ఏడాది నిశ్చితార్థం ప్రకటన చేశారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు.
పెళ్ళైన లావణ్య నటనకు గుడ్ బై చెబుతారనే ప్రచారం జరిగింది. అయితే లావణ్య ఇకపై కూడా నటిస్తానని క్లారిటీ ఇచ్చింది. ఆమె నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ విడుదలైన నేపథ్యంలో ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. పెళ్ళయాక కూడా నట కొనసాగిస్తారా? అనే ప్రశ్నకు లావణ్య స్పందించారు. నన్ను అర్థం చేసుకునే భర్త దొరికాడు. నేను నటనను కొనసాగిస్తాను అని ఆమె చెప్పుకొచ్చారు.
తెలుగులో ఓ చిత్రం చేస్తున్నట్లు లావణ్య వెల్లడించారు. దీంతో మెగా కోడలు కూడా సమంత మాదిరి పెళ్లి తర్వాత నటించాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. పెళ్ళికి ముందు లావణ్య త్రిపాఠి ఫెయిల్యూర్స్ లో ఉంది. ఆమె నటించిన చిత్రాలు వరుసగా పరాజయం పాలయ్యాయి.