Asianet News TeluguAsianet News Telugu

డేంజర్ బెల్స్... హ్యాట్రిక్ పూర్తి చేసిన బేబమ్మ!

వరుసగా మూడు విజయాలు నమోదు చేసి కృతి శెట్టి లక్కీ హీరోయిన్ ట్యాగ్ పట్టేశారు. అయితే ఆ ఇమేజ్ ఇప్పుడు తిరగబడిన దాఖలాలు కనిపిస్తున్నారు. ఆమె ఐరన్ లెగ్ ఇమేజ్ కి దగ్గరయ్యారు. హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేసి దర్శక నిర్మాతలు దృష్టిలో బ్యాడ్ అయ్యారు.

heroine kriti shetty career in danger faced hatric flops
Author
First Published Sep 18, 2022, 12:48 PM IST

ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిన కృతి శెట్టి ఫేట్ పూర్తిగా తిరబడినట్లనిపిస్తుంది. ఎంట్రీతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ యంగ్ బ్యూటీ... హ్యాట్రిక్ ప్లాప్స్ కూడా పూర్తి చేసింది. కృతి శెట్టి గత మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో లక్కీ హీరోయిన్ ట్యాగ్ దొబ్బేసింది. గత ఏడాది విడుదలైన ఉప్పెన సంచలన విజయం సాధించింది. వంద కోట్లకు పైగా వసూళ్లతో డబుల్ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. ఉప్పెన టాలీవుడ్ మోస్ట్ ప్రాఫిటబుల్ చిత్రాల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. ఈ మూవీతో కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. పది హిట్ చిత్రాల్లో నటించినంత ఫేమ్ సొంతం చేసుకున్నారు. 

కాలేజ్ గర్ల్ గా కృతి లుక్, యాక్టింగ్, గ్లామర్ యూత్ ని ఊపేసింది. ఇక ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్ మూవీలో నానితో జతకట్టింది. లిప్ కిస్సులు, హాట్ బెడ్ రూమ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. సాయి పల్లవి మరో హీరోయిన్ గా నటించిన శ్యామ్ సింగరాయ్ సూపర్ హిట్ కొట్టింది. ఇక 2022 సంక్రాంతి రిలీజ్ బంగార్రాజు మూవీలో పల్లెటూరి అమాయకపు, అల్లరి ఆడపిల్లగా నటించి మెప్పించింది. సీజన్ ని క్యాష్ చేసుకున్న బంగార్రాజు హిట్ స్టేటస్ అందుకుంది. 

వరుసగా మూడు విజయాలు నమోదు చేసి కృతి శెట్టి లక్కీ హీరోయిన్ ట్యాగ్ పట్టేశారు. అయితే ఆ ఇమేజ్ ఇప్పుడు తిరగబడిన దాఖలాలు కనిపిస్తున్నారు. ఆమె ఐరన్ లెగ్ ఇమేజ్ కి దగ్గరయ్యారు. హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేసి దర్శక నిర్మాతలు దృష్టిలో బ్యాడ్ అయ్యారు. కృతి నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్స్ అయ్యాయి. ఈ రెండు భారీ నష్టాలు మిగిల్చాయి. ఇక లేటెస్ట్ రిలీజ్ 'ఆ అమ్మాయి గురించి మీకు' చెప్పాలి పరిస్థితి కూడా అలానే ఉంది. 

మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రానికి ఓపెనింగ్స్ పూర్ గా ఉన్నాయి. సుధీర్ బాబు హీరోగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ మూవీలో విషయం లేదని ప్రేక్షకులు తేల్చేశారు. పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కృతి ఖాతాలో మరో ప్లాప్ ఖాయమే అంటున్నారు. ఆ విధంగా కృతి హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేసింది. వరుస పరాజయాలతో అమ్మడు కెరీర్ ప్రమాదంలో పడింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాగ చైతన్య, సూర్య చిత్రాలు ఉన్నాయి. ఇక వీటి పైనే అమ్మడు ఆశలు పెట్టుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios