మంచు విష్ణుకు బిగ్ షాక్... కన్నప్ప నుండి హీరోయిన్ ఔట్, కారణం ఇదే!
ఆదిలోనే హంసపాదు అన్నట్లు మంచు విష్ణుకు భారీ షాక్ తగిలింది. కన్నప్ప మూవీ నుండి హీరోయిన్ కృతి సనన్ తప్పుకుంది.

హీరో మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో మంచు విష్ణు కన్నప్ప ప్రాజెక్ట్ చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో ఆగస్టు నెలలో పూజా కార్యక్రమాలు జరిపి చిత్రం ప్రారంభించారు. మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఆయన ఓ కీలక రోల్ కూడా చేస్తున్నారని సమాచారం. హిందీ మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె కన్నప్ప పూజా కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అనూహ్యంగా నుపుర్ సనన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దురదృష్టం... లవ్లీ లేడీ నుపుర్ సనన్ కన్నప్ప ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. మరొక హీరోయిన్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. షెడ్యూల్స్ కి నుపుర్ సనన్ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడమే కారణం. ఆమె ఇతర ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్ అని అని మంచు విష్ణు ట్వీట్ చేశారు. మంచు విష్ణు ట్వీట్ వైరల్ అవుతుంది. రవితేజకు జంటగా నుపుర్ టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.
మరోవైపు కన్నప్ప మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. హీరో ప్రభాస్(Prabhas) కన్నప్పలో కీలక రోల్ చేస్తున్నారట. మంచు విష్ణు హీరోగా తెరకెక్కే మూవీలో ప్రభాస్ నటించడం ఊహించని పరిణామం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ వార్త నిజమే అంటున్నారు. ప్రభాస్ శివునిగా కనిపించే అవకాశం ఉందంటున్నారు. అదే నిజమైతే కన్నప్ప సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ప్రచారం కల్పిస్తుంది. మార్కెట్ కోల్పోయిన మంచు విష్ణు మూవీకి ప్రభాస్ కారణంగా వసూళ్లు దక్కుతాయి.
మంచు విష్ణు కెరీర్లోనే భారీ బడ్జెట్ తో కన్నప్ప తెరకెక్కుతుంది. ఇది భక్తిరస చిత్రం. 1976లో కృష్ణంరాజు హీరోగా బాపు తెరకెక్కించిన భక్త కన్నప్ప బ్లాక్ బస్టర్ హిట్. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనేది ప్రభాస్ కోరిక. ఆయన పెదనాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్ ని భక్త కన్నప్పగా చూడాలి అనుకున్నారు అది జరగలేదు..