కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్!
జూలై 27న జన్మదినం జరుపుకున్న కృతి సనన్ కీలక ప్రకటన చేశారు. ఆమె కాస్మటిక్స్ రంగంలో అడుగు పెడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఈ తరం హీరోయిన్స్ చాలా చురుకు. సంపాదనకు పలు మార్గాలు వెతుకుతున్నారు. ఎందుకంటే యాక్టింగ్ గ్యారంటీ లేని కెరీర్. వరుసగా మూడు ప్లాప్స్ పడ్డాయంటే తట్టాబుట్టా సర్దాల్సిందే. అందుకే ఫేమ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. లైఫ్ టైం హ్యాపీగా జీవించేలా ఆర్థిక భద్రత సాధించాలి. ఈ కారణంగా పలు రంగాల్లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే కొందరు హీరోయిన్స్ బిజినెస్ ఉమెన్స్ గా మారారు.
కృతి సనన్ సైతం కొత్త బిజినెస్ స్టార్ చేశారు. పీఈపీ టెక్నాలజీస్ తో చేతులు కలిపిన కృతి సనన్ హైఫెన్ అనే ప్రీమియమ్ స్కిన్‌కేర్ లైన్ స్టార్ట్ చేసింది. హైఫెన్ బ్రాండ్ లగ్జరీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అందుబాటులోకి తేనుంది. హైఫన్ బ్రాండ్ మూడు రకాల ఉత్పత్తులను ప్రకటించింది. డైలీ యూస్ కోసం... బారియర్ కేర్ క్రీమ్, గోల్డెన్ అవర్ గ్లో సీరమ్ , ఆల్ ఐ నీడ్ సన్ స్క్రీన్ SPF 50 PAని లాంచ్ చేశారు. ఈ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ కృతి సనన్ ఇంస్టాగ్రామ్ లో వీడియోలు పెట్టారు.
దీపికా సైతం కాస్మటిక్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆమె బ్రాండ్ కి పోటీగా కృతి సనన్ హైఫెన్ బ్రాండ్ ని లాంచ్ చేశారనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల కృతి సనన్ బ్లూ బటర్ ఫ్లై ఫిలిమ్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను లాంచ్ చేసింది. తాజాగా కాస్మెటిక్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది. చూస్తుంటే కృతి సనన్ ఎంట్రప్రెన్యూర్ గా ఉన్నత శిఖరాలకు చేరుతుందనిపిస్తుంది.
కృతి సనన్ ఆదిపురుష్ మూవీలో సీతగా నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ రాఘవుడు పాత్ర చేశారు. సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాగా గతంలో ప్రభాస్-కృతి సనన్ మధ్య ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. ఈ వార్తలను కృతి ఖండించారు. ప్రభాస్ మంచి మిత్రుడు మాత్రమే అని చెప్పారు.