కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. సిల్క్ స్మితలా ఫీలవుతున్నా అంటూ ఓ క్రేజీ ఫోటో షేర్ చేశారు.  

హీరోయిన్ కీర్తి సురేష్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆమె లేటెస్ట్ మూవీ దసరా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన విలేజ్ రివేంజ్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాని-కీర్తి సురేష్ ల పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇక నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ దసరా మూవీ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి దగ్గరైన దసరా చిత్రం నానికి క్లీన్ హిట్ అందించింది. 

ప్రారంభం నుండి దసరా చిత్రాన్ని సిల్క్ స్మిత పోస్టర్ తో ప్రమోట్ చేస్తున్నారు. సినిమాలో కల్లు పాకలో సిల్క్ స్మిత పోస్టర్ ఉంటుంది. స్మిత బార్ అని దాన్ని అంటారు. దసరా మూవీ కోసం పెద్ద విలేజ్ సెట్ వేశారు. అందులో కల్లు పాక కూడా ఉంది. కల్లు పాకలో ఉన్న సిల్క్ స్మిత పోస్టర్ వద్ద కీర్తి సురేష్ ఫోజ్ ఇచ్చారు. సిల్క్ స్మిత పోస్టర్ ని ఇమిటేట్ చేస్తూ... ఆమెలా ఫీల్ అవుతున్నా అంటూ కామెంట్ పెట్టారు. 

View post on Instagram

షూటింగ్ ముగిశాక సెట్ కూల్చేస్తుండగా... కీర్తి సురేష్ పరుగున వెళ్లి సిల్క్ స్మిత పోస్టర్ దగ్గర నిల్చుని ఫోటో దిగారట. అదే విషయం తెలియజేస్తూ... కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. కాగా కీర్తి కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ భోళా శంకర్. చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కీర్తి చిరంజీవి చెల్లెలు పాత్ర చేయడం విశేషం. 

భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. భోళా శంకర్ తో పాటు కొన్ని తమిళ చిత్రాల్లో కీర్తి సురేష్ నటిస్తుంది. ఆమె కెరీర్ పీక్స్ లో ఉండగా తరచూ ఎఫైర్ వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల ఆమె బిజినెస్ మాన్ అయిన తన క్లాస్ మేట్ ని వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని కీర్తి సురేష్ తల్లి ఖండించడం విశేషం.