కరణ్ జోహార్ నీ పని అయిపోయింది రిటైర్ అయిపో... విరుచుకుపడిన కంగనా రనౌత్
రణ్వీర్ సింగ్-అలియా భట్ జంటగా నటించిన రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ డే పూర్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ క్రమంలో కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా ఘాటు కామెంట్స్ చేశారు.

రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ చిత్రాన్ని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్స్ పరంగా వెనుకబడింది. ఫస్ట్ డే రూ. 11 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఈ క్రమంలో కంగనా రనౌత్ కరణ్ జోహార్ మీద ఫైర్ అయ్యారు. మీ పని అయిపోయింది. డబ్బులు నాశనం చేసుకోకుండా పరిశ్రమ నుండి నిష్క్రమించు అని ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
జనాలు పిచ్చోళ్ళు కాదు. ఇలాంటి పేలవమైన చిత్రాలను ఖచ్చితంగా తిరస్కరిస్తారు. ఈ సినిమాలో సెట్స్, కాస్ట్యూమ్స్ కూడా ఫేక్. 90లలో కరణ్ ఏం చేశాడో... ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. కాపీ కొట్టడానికి సిగ్గు అనిపించడం లేదా. ఒక సీరియల్ లాంటి సినిమాకు రూ. 250 కోట్లు ఖర్చు చేశారట. టాలెంట్ ఉన్నవాళ్లను పక్కన పెట్టి మీరు మాత్రం డబ్బులు వృధాగా కుమ్మరిస్తున్నారు.
మూడు గంటల నిడివి ఉన్నా ఓపెన్ హైమర్ మూవీనే జనాలు చూస్తారు. నీ చెత్త సినిమా చూడరు. అత్తాకోడళ్ల డ్రామాకు వందల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నువ్వేదో గొప్ప ఫిలిం మేకర్ అనుకుంటున్నావు. అదేం లేదు. నీ పని అయిపోయింది. డబ్బులు నాశనం చేసుకోకుండా రిటైర్ అయిపో. హీరో రణ్వీర్ సింగ్ కి నా సలహా ఏమిటంటే? కరణ్ జోహార్ ని ఫాలో అవ్వొద్దు. అతనిలా బట్టలు వేసుకోకు. ధర్మేంద్ర, వినోద్ ఖన్నా మాదిరి బట్టలు వేసుకో. లేదంటే మన సౌత్ హీరోలను చూసి నేర్చుకో. నీ వస్త్రధారణతో మన సంస్కృతి నాశనం చేయకంటూ.. ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.
ఎప్పటి నుండో కరణ్ జోహార్, అలియా భట్, సల్మాన్ వంటి స్టార్స్ ని కంగనా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వీరంతా మాఫియాగా ఏర్పడి కొత్త వాళ్ళను, బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళను తొక్కేస్తున్నారని ఆమె ప్రధాన ఆరోపణ. సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం నేపోటిజం కి వ్యతిరేకంగా ఈమె దాడి మరింత ఉధృతం చేశారు.