హీరోయిన్లు అంటే ఎందులోనూ తక్కువ కాదు.. ముఖ్యంగా హీరోలకు ఏమాత్రం తీసిపోరు అని మరోసారి నిరూపించింది సీనియర్ హీరోయిన్ జ్యోతిక. వేలమంది చూస్తుండగా.. స్టేజ్ పైన ఆమె చూపించన టాలెంట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా వెలుగు వెలిగింది జ్యోతిక. నగ్మ చెల్లెలిగా ఇండస్ట్రీకి వచ్చి.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకున్న ఈ బ్యూటీ.. హీరో సూర్యను పెళ్ళి చేసుకుని హ్యాపీగా చెన్నైలో సెటిల్ అయిపోయింది. ఇక పెళ్ళి తరువాత హీరోయిన్ గా నటనకు గుడ్ బై చెప్పిన జ్యోతికా.. చాలా కాలం స్క్రీన్ కు దూరంగా ఉంది. ఈ మధ్యకాలంలో నిర్మాతగా మారింది. అంతే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతోంది. ఇక ఆమె హీరోయిన్ గా మాత్రమే కాకుండా మల్టీ టాలెంటెడ్ గా ఎప్పుడో నిరూపించుకుంది. ఇక ఈ మధ్య మరోసారి ఆడియన్స్ ను మరో టాలెంట్ తో ఆశ్చర్యపరిచింది జ్యోతిక.
సాధారణంగా ఏదైనా స్టంట్స్ లాంటివి హీరోలు చేస్తుంటారు. ఒక్కొసారి అది కూడా డూప్ లతో మ్యానేజ్ చేస్తుంటారు. అలాంటిది జ్యోతికా స్టేజ్ పైన లైవ్ లో ఓ స్టంట్ చేసి చూపించింది. అది కూడా చీరకట్టులో ఉన్పప్పుడు.. వేల మంది చూస్తుండగా.. ఎంతో ధైర్యంగా.. కాన్ఫిడెంట్ గా కర్రసాము చేసి చూపించింది జ్యోతిక. 2020లో JFW మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా ఇదంతా జరిగింది. తాజాగా మరోసారి ఈ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో అదికాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన తెలుగు-తమిళ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు పిల్లల తల్లయిన జ్యోతిక.. ఇంత ఫామ్ లో ఉండగటం.. అంత ఎనర్జీ చూపించడంతో.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రకరకాల కామెంట్లతో జ్యోతికను ఆకాశానికిఎత్తేస్తున్నారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరు పెంచేస్తోంది జ్యోతిక. వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటుంది. తనకు తన ఇమేజ్ కు తగినట్టుగా క్యారెక్టర్ రోల్స్ ను సెలక్ట్ చేసుకునే పనిలో పడింది.
