ఎన్టీఆర్ 30 మూవీలో జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె ఫోటో షూట్ కూడా చేశారట.


ఎన్టీఆర్ 30 గ్రాండ్ లాంచ్ కి అన్నపూర్ణ స్టూడియో సిద్ధం అవుతుంది. ఫిబ్రవరి 24న పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ 30 లాంచింగ్ ఈవెంట్ కి టాలీవుడ్ ప్రముఖులు పలువురు హాజరుకానున్నారట. ఆరంభంతోనే భారీ ఎత్తున ప్రచారం దక్కేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక మార్చి నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. దీని కోసం ప్రత్యేకమైన సెట్ రూపొందించారు. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. 

నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశారట. అక్కడ కూడా ఓ భారీ సెట్ నిర్మిస్తున్నారనే సమాచారం ఉంది. 2024 ఏప్రిల్ 5 విడుదల తేదీగా ప్రకటించారు. అంటే ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో నిరవధికంగా షూటింగ్ జరపనున్నారు. అయితే ఇంత వరకు ఎన్టీఆర్ 30 హీరోయిన్ పై అధికారిక ప్రకటన రాలేదు. ప్రాజెక్ట్ ప్రకటించి ఏడాది దాటిపోయినా ఎన్టీఆర్ కి కొరటాల శివ హీరోయిన్ సెట్ చేయలేదు. అలియా భట్ చేయాల్సి ఉంది. ఆమె వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్ట్ కి సైన్ చేసిన తర్వాత తప్పుకున్నారు. 

ఈ క్రమంలో పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే జాన్వీ కపూర్ ని కన్ఫర్మ్ చేశారు అంటున్నారు. ఆమెతో చర్చలు ముగియడంతో పాటు ఒప్పందం కూడా కుదిరిందట. ఈ క్రమంలో టెస్ట్ షూట్ చేశారట. హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ 30 లుక్ టెస్ట్ లో జాన్వీ పాల్గొన్నారని వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉండగా జాన్వీ -ఎన్టీఆర్ జతకట్టనున్నారని అంటున్నారు. మరి ఇదే నిజమైతే ఫిబ్రవరి 24న జరిగే పూజా కార్యక్రమంలో జాన్వీ పాల్గొనే అవకాశం కలదు. 

శ్రీదేవి వారసురాలైన జాన్వీ కపూర్ ని సౌత్ కి తీసుకురావాలని చాలా మంది మేకర్స్ ట్రై చేశారు. అది ఎన్టీఆర్ మూవీతో సాధ్యమైందని అంటున్నారు. ఒక ఎన్టీఆర్ తాతయ్య ఎన్టీఆర్, జాన్వీ తల్లి శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ మీద చరిత్ర సృష్టించారు. వారిద్దరి కాంబోలో ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్-జాన్వీ లది ప్రత్యేకమైన కాంబినేషన్ కానుంది.  ఇక ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ కథ ఇదే అంటూ అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కుతుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.