స్టాండప్ కమెడియన్ ప్రేమలో హీరోయిన్..? ఫోటోతో క్లారిటీ ఇచ్చిన డస్కీ బ్యూటీ..
హీరోయిన్ గాయత్రీ శంకర్.. ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె సినిమాల పరంగా కాదు, ప్రేమ విషయంలో చర్చనీయాంశంగా మారింది. స్టాండప్ కమెడియన్ ప్రేమలో ఉన్నారనే వార్త ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తుంది.

హీరోయిన్ గాయత్రీ శంకర్.. ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె సినిమాల పరంగా కాదు, ప్రేమ విషయంలో చర్చనీయాంశంగా మారింది. స్టాండప్ కమెడియన్ ప్రేమలో ఉన్నారనే వార్త ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తుంది. ఆ వివరాలు చూస్తే.. తమిళంలో `18 వయసు` చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `నడువుల కొంజం పక్కత కానోమ్` సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది. `మామనితమ్`, `విక్రమ్` సినిమాల్లోనూ మెరిసింది.
అయితే తాజాగా గాయత్రీ శంకర్ స్టాండప్ కమెడియన్ అర్వింద్ ప్రేమలో ఉన్నారనే వార్త హాట్ టాపిక్ అవుతుంది. కమెడియన్‌తో గాయత్రీ డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె పంచుకున్న ఫోటో మరింత చర్చనీయాంశంగా మారుతుంది. ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలో అర్వింద్‌ని హగ్ చేసుకుని కనిపించింది గాయత్రీ. అందులో అదిరిపోయే క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారనే ఓ నిర్ణయానికి వచ్చేశారు.
ఇందులో గాయత్రీ చెబుతూ, కమెడియన్‌గా అతని ఎదుగుదలనుప్రశంసించింది. అతని పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేసింది. రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని మీరు మాట్లాడటం నుంచి ఇంత దూరం ప్రయాణించారు, మీతో మాట్లాడుతున్నందుకు చాలా గర్వపడుతున్నా` అని పేర్కొంది. ఈ పోస్ట్, ఆ ఫోటో నెట్టింట వైరల అవుతుంది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ డేటింగ్ కపుల్ అంటూ, క్రేజీ లవర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
స్టాండప్ కమెడియన్‌గా పాపులర్ అయిన అరవింద్ పూర్తి పేరు అరవింద్ సుబ్రమణం. అందరు అరవింద్ ఎస్ ఏ అంటారు. 2013లో తమిళం చిత్రం `ఆరంభం`కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్ఆవత 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అత్యంత ఇష్టపడే వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు, హిందీ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల 2020లో అమెజాన్ ప్రైమ్‌లో `ఐ వాజ్ నాట్ రెడీ డా` షోలో చేశాడు. ప్రస్తుతం ఇండియాతోపాటు కెనడా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో `వీ నీడ్ టూ టాక్` అనే కామెడీ షోని ప్రదర్శిస్తున్నాడు. ఇలా అరవింద్ తమిళనాడులోనే కాదు, ఇండియా దాటి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.