ప్రభాస్‌ చేసే సినిమాల్లో హను రాఘవపూడి మూవీ కూడా ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు. కానీ ఇందులో హీరోయిన్‌ మాత్రం ఫిక్స్ అయ్యిందట. 


ప్రభాస్‌ జాబితాలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. ఆయన పేరుతోనే వేల కోట్ల సినిమా వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో ఏ ఒక్క సినిమా వెయ్యి కోట్లకు తక్కువ కాదు. ఐదారు సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. ఇటీవల `సలార్‌`తో దుమ్మురేపిన ప్రభాస్‌.. ప్రస్తుతం `కల్కి2898ఏడీ` చిత్రంలో నటించారు. ఈ చిత్రం మే 9న విడుదల కాబోతుంది. దీంతోపాటు మారుతితో `ది రాజా సాబ్‌` చిత్రం రూపొందుతుంది. అలాగే `స్పిరిట్‌` చిత్రం త్వరలో తెరకెక్కబోతుంది. 

ఈ నేపథ్యంలో ప్రభాస్‌.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీ ఈ ఏడాది చివర్లోగానీ, లేదంటే వచ్చే ఏడాదిగానీ ప్రారంభం కానుంది. సినిమా రావడానికి ఇంకా రెండేళ్లు పట్టే ఛాన్స్ ఉంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ మాత్రం జరుగుతుంది.స్క్రిప్ల్ ఫైనలైజ్‌ చేసే పనిలో దర్శకుడు హను రాఘవపూడి ఉన్నాడట. దీంతోపాటు కాస్టింగ్‌ని కూడా ఫైనలైజ్‌ చేయబోతున్నారట. 

ఈ క్రమంలో ఆయన ప్రభాస్‌ సినిమాలో నటించే హీరోయిన్‌ని ఫైనల్‌ చేసినట్టు తెలుస్తుంది. తన సీతనే హీరోయిన్‌గా అనుకుంటున్నాడట. హను రాఘవపూడి చివరగా `సీతారామం` చిత్రాన్ని రూపొందించి పెద్ద హిట్‌ కొట్టాడు. రొమాంటిక్‌ మ్యూజిక్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో సీత పాత్రలో మెస్మరైజ్‌ చేసింది మృణాల్‌ ఠాకూర్‌. ఇప్పుడు ఆమె బిజీ హీరోయిన్‌ అయిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ని ప్రభాస్‌ సినిమాకి ఎంపిక చేశారట. ఈ సినిమా కూడా వార్‌ నేపథ్యంలో సాగే రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ అని తెలుస్తుంది. ఇందులో డార్లింగ్‌ సైనికుడిగా కనిపిస్తారని సమాచారం. 

`సీతారామం`లో మృణాల్‌ యాక్టింగ్‌ చూశాడు హను రాఘవపూడి. ఆమె నటనతో అదరగొడుతుంది. మేకోవర్ లో మతిపోగొడుతుంది. దీంతో ప్రభాస్‌ సినిమాలో ఆయనకు జోడీగా ఫైనల్‌ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం మృణాల్‌.. విజయ్‌ దేవరకొండతో `ఫ్యామిలీ స్టార్‌` చిత్రంలో నటిస్తుంది. హిందీలో ఓ సినిమా చేస్తుంది. ఓ తమిళ చిత్రానికి చర్చలు జరుగుతున్నాయట. ఇదిలా ఉంటే ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` లోనూ మృణాల్‌ గెస్ట్ గా మెరవబోతుందట.