గతేడాది ఓ భారీ బ్లాక్ బస్టర్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ ని నిర్మాతలు మోసం చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ పేరు చెప్పి ఆమెతో సినిమా సైన్ చేయించుకొని ఇప్పుడు ఆమెని చీట్ చేశారట. తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ ఉన్న ఓ స్టార్ హీరోయిన్ తో లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్లాన్ చేశారు టాలీవుడ్ దర్శకనిర్మాతలు.

ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడని నిర్మాతలు చెప్పడంతో సదరు హీరోయిన్ సినిమా చేయడానికి అంగీకరించిందట. ఆ నిర్మాతలు ఎన్టీఆర్ కి బాగా క్లోజ్ కావడంతో ఆమె కూడా వారి మాటలు నమ్మింది.

అయితే సినిమా షూటింగ్ 85% పూర్తవుతున్నా ఇంకా ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ కాకపోవడంతో సదరు హీరోయిన్ నిర్మాతలను ప్రశ్నించిందట. దానికి వారు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో, ఆమె విషయం అర్ధం చేసుకొని ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట. ఈ విషయం తనను బాధించడంతో మిగిలిన షూటింగ్ పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేసిందట.

దీంతో నిర్మాతలు ఆమెని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ తదుపరి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మీకే ఇప్పిస్తామని ఆమెని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం వారి మాటలను నమ్మడానికి సిద్ధంగా లేదు. మరి ఇంతకీ సినిమా పూర్తి చేస్తందో లేదో చూడాలి!