Asianet News TeluguAsianet News Telugu

ఆ సినిమా చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది... హిందీ పరిశ్రమలో భూమికకు తీరని అన్యాయం!


బాలీవుడ్ పై సీనియర్ హీరోయిన్స్ ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరిగా తమకు జరిగిన అన్యాయం బయటపెడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో భూమిక చేరారు. 

heroine bhumika made interesting comments on bollywood ksr
Author
First Published Apr 26, 2023, 1:56 PM IST

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమను ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశారు. సౌత్ పరిశ్రమలో క్రమశిక్షణ, విలువలు ఉంటాయి. బాలీవుడ్ లో అవి లేవన్నారు. ఇక ప్రియాంక చోప్రా అయితే ఇక్కడ రాజకీయాలు ఎక్కువ. నన్ను కార్నర్ చేసి ఆఫర్స్ రాకుండా చేశారు. అందుకే బాలీవుడ్ నుండి వెళ్లిపోవాల్సి వచ్చిందని ఓపెన్ కామెంట్స్ చేశారు. తాజాగా భూమిక హిందీ చిత్ర పరిశ్రమలో తనకు జరిగిన అన్యాయం బయటపెట్టారు. పలు చిత్రాల నుండి తనను తప్పించినట్లు చెప్పుకొచ్చారు. 

భూమిక మాట్లాడుతూ... హిందీలో తేరే నామ్ నా మొదటి చిత్రం. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఆ మూవీ సూపర్ హిట్. దాంతో నాకు ఓ పెద్ద నిర్మాణ సంస్థలో ఆఫర్ వచ్చింది. ఆచితూచి సినిమాలు చేసే నేను ఆ చిత్రానికి సైన్ చేశాను. ఆ ప్రాజెక్ట్ కోసం పలు చిత్రాలు వదులుకున్నాను. నిర్మాత మారడంతో హీరోతో పాటు నన్ను కూడా మార్చేశారు. ఏడాది పాటు ఆ మూవీ కోసం ఎదురు చూశాను. ఈ పరిణామం బాగా నిరాశపరిచింది. ఆ చిత్రం చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదేమో, అన్నారు. 

heroine bhumika made interesting comments on bollywood ksr

జబ్ వి మెట్ చిత్రానికి నేను సైన్ చేశాను. బాబీ డియోల్ హీరో అన్నారు. తర్వాత షాహిద్ కపూర్ అన్నారు. కట్ చేస్తే షాహిద్ పక్కన కరీనా కపూర్ ని తీసుకొని నన్ను పక్కన పెట్టేశారు. శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలో కూడా మొదట నేనే హీరోయిన్. ఆ ప్రాజెక్ట్ విషయంలో కూడా అన్యాయం జరిగింది. మణిరత్నం తెరకెక్కించిన అమృతం చిత్రం నుండి కూడా మొదట ఆఫర్ ఇచ్చి, తర్వాత హ్యాండ్ ఇచ్చారని భూమిక అన్నారు.  

heroine bhumika made interesting comments on bollywood ksr

సల్మాన్ తో మూవీ చేసిన సమయంలో భూమిక కెరీర్ సౌత్ లో పీక్స్ లో ఉంది. ముఖ్యంగా తెలుగులో ఖుషి, ఒక్కడు, సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్స్ ఆమె ఖాతాలో పడ్డాయి. అయితే అప్పట్లో బాలీవుడ్  దేశంలోనే అతిపెద్ద పరిశ్రమ. అక్కడ సెటిల్ అయితే తిరుగుండదని హీరోయిన్స్ భావించేవారు. కోట్ల రెమ్యూనరేషన్ సంపాదించవచ్చని భావించేవారు. ప్రస్తుతం భూమిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios