Asianet News TeluguAsianet News Telugu

భాగ్యశ్రీని వెంటాడిన బ్యాడ్ లక్... అలా బ్లాక్ బస్టర్ మిస్! మిస్టర్ బచ్చన్ తో అడ్డంగా బుక్!


భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. భాగ్యశ్రీ బోర్సే బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకుని ప్లాప్ మూవీకి సైన్ చేసింది. ఆమెను బ్యాడ్ లక్ వెంటాడింది.. 
 

heroine bhagyashri borse supposed to aay not mr bachchan movie ksr
Author
First Published Aug 21, 2024, 10:37 AM IST | Last Updated Aug 21, 2024, 10:46 AM IST

ముంబై భామ భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. రవితేజ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించాడు. ఈ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. గోల్డెన్ రిలీజ్ డేట్ దొరికినా ఉపయోగించుకోలేకపోయింది. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ మిస్టర్ బచ్చన్ చిత్రానికి దక్కింది. సోమవారం మినహాయిస్తే మంగళవారం రాఖీ పూర్ణిమ. ఇన్ని సెలవు దినాల మధ్య విడుదలైన మిస్టర్ బచ్చన్ వసూళ్ళు ఏమంత ఆశాజనకంగా లేవని ట్రేడ్ వర్గాల అంచనా. 

దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ విడుదలకు ముందు గట్టి విశ్వాసం ప్రకటించారు. మీకు ఇష్టం వచ్చినట్లు రివ్యూలు రాసుకోండి... నా సినిమాకు ఎలాంటి నష్టం జరగదు అన్న కోణంలో మాట్లాడాడు. కట్ చేస్తే మూవీలో విషయం లేదని ప్రేక్షుకులే తేల్చేశారు. దానికి తోడు హరీష్ శంకర్ తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ విమర్శల పాలయ్యాయి. ఓ సాంగ్ లో రవితేజ హీరోయిన్ నడుము పట్టుకున్న తీరును ప్రేక్షకులు తప్పుబట్టారు. 

మిస్టర్ బచ్చన్ మూవీ చూసి రవితేజ అభిమానులు ఆవేదనకు గురయ్యారు. కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎమోషనల్ లెటర్స్ తమ హీరోకి రాశారు. ఆ రేంజ్ లో మిస్టర్ బచ్చన్ నిరాశపరిచింది. మిస్టర్ బచ్చన్ విడుదలకు ముందే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగింది. ఆమె గ్లామర్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆమె ఫస్ట్ తెలుగు మూవీ డిజాస్టర్ అయ్యింది. 

అయితే భాగ్యశ్రీ చేజేతులా బ్లాక్ బస్టర్ మిస్ చేసుకుందట. మిస్టర్ బచ్చన్ తో పాటు ఆగస్టు 15న విడుదలైన ఆయ్ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. పెట్టుబడికి మూడు రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటించాడు. ఆయ్ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీని సంప్రదించారట. భాగ్యశ్రీ ఆయ్ చిత్రానికి సైన్ చేసిందట. ఆమె ఆయ్ మూవీ కోసం కొన్ని రోజులు శిక్షణ తీసుకుందట. 

ఇంతలో దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ లో రవితేజ పక్కన ఛాన్స్ ఇచ్చాడట. రవితేజ స్టార్ హీరో కావడంతో ఆయ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న భాగ్యశ్రీ మిస్టర్ బచ్చన్ కి కమిట్ అయ్యిందట. కట్ చేస్తే ఒకే రోజు విడుదలైన ఆయ్ బ్లాక్ బస్టర్ కొడితే, బడా హీరో రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ ప్లాప్ అయ్యింది. మిస్టర్ బచ్చన్ రిజల్ట్ ఏదైనా భాగ్యశ్రీ కెరీర్ కి వచ్చిన ఢోకా లేదు. విజయ్-హెచ్ వినోద్ కాంబోలో వస్తున్న చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో కూడా భాగ్యశ్రీకి ఆఫర్స్ క్యూ కట్టే ఛాన్స్ ఉంది... 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios