Asianet News TeluguAsianet News Telugu

ఆ ఒక్క కారణానికి 5 కోట్లు వదులుకున్న అనుష్క శెట్టి... స్వీటీనా మజాకా!

హీరోయిన్ అనుష్క శెట్టి తానెంతో ప్రత్యేకం అని నిరూపించుకున్నారు. ఏకంగా ఐదు కోట్ల రూపాయలు వదులుకున్నారట. ఓ స్టార్ హీరో సినిమాలో ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. అంత పెద్ద ప్రాజెక్ట్ వదిలేయడానికి కారణం ఏమిటో చూద్దాం.. 
 

heroine anushka shetty rejected rupees 5 crore offer for this reason ksr
Author
First Published Jun 21, 2024, 3:07 PM IST

చిత్ర పరిశ్రమలో అనిశ్చితి ఎక్కువ. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత... ఎవరైనా సక్సెస్ ఉన్నంత వరకే పరిశ్రమలో ఉంటారు. లేదంటే ఎవరూ పట్టించుకోరు. ముఖ్యంగా హీరోయిన్స్ కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మహా అయితే ఐదేళ్లు లేదంటే ఓ పదేళ్లు. కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే దశాబ్దాల పాటు పరిశ్రమలో హీరోయిన్స్ గా కొనసాగుతారు. అందుకే హీరోయిన్స్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సూత్రం పాటిస్తారు. 

స్టార్డం ఉన్నంత కాలం ఎడాపెడా సినిమాలు చేసి ఒక రూపాయి వెనకేసుకోవాలని భావిస్తారు. ఆర్థిక భద్రత ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొందరు హీరోయిన్స్ చాలా ప్రత్యేకం. డబ్బుకు అసలు ప్రాధాన్యత ఇవ్వరు. పాత్ర నచ్చాలి, ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేస్తామని అంటారు. లేదంటే నో చెప్పేస్తారు. ఈ కోవకు చెందినదే అనుష్క శెట్టి. కెరీర్ బిగినింగ్ లో కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ ఒక ఇమేజ్ వచ్చాక, ఆరాధించే అభిమాన వర్గం తయారయ్యాక... అనుష్క ఆచితూచి సినిమాలు చేస్తుంది. 

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం మానేసింది. లేడీ ఓరియెంటెడ్ లేదా తన పాత్రకు వెయిట్ ఉన్న చిత్రాలు చేస్తుంది. బాహుబలి తర్వాత అనుష్క చేసిన ప్రతి చిత్రంలో ఆమె పాత్ర కీలకం. పాత్రకు వెయిట్ ఉంటే నవీన్ పోలిశెట్టి వంటి యంగ్ హీరోతో జతకట్టేందుకు కూడా ఆమె వెనుకాడలేదు. కాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ అనంతరం ఆమెకు ఓ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ వచ్చిందట. 

రెమ్యునరేషన్ గా రూ. 5 కోట్లు ఆఫర్ చేశారట. అయినా అనుష్క చేయను అని చెప్పారట. అందుకు కారణం హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేకపోవడమేనట. అనుష్కకు ఒకప్పుడు ఉన్నంత ఫాలోయింగ్ లేదు. ఆమె కెరీర్ చివరి దశకు చేరింది. అలాంటి తరుణంలో ఐదు కోట్ల రూపాయల ఆఫర్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అనుష్క మాత్రం సింపుల్ గా నో చెప్పిందట. 

ప్రస్తుతం ఆమె క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీ మూవీ చేస్తుంది. ఇది భారీ లేడీ ఓరియెంటెడ్ మూవీ. అలాగే ఓ తమిళ చిత్రం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు అనుష్క శెట్టి పెళ్లి మేటర్ పక్కన పెట్టేసింది. నాలుగు పదులు వయసు దాటినా అనుష్క ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios