ఒక్క సినిమాతోనే ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిన హీరో విజయ్ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ పేరే జాతీయ స్థాయిలో మారు మోగిపోయింది. ఆ సినిమాలో విజయ్‌ లుక్‌, నటన యాటిట్యూడ్ ఇలా అన్ని ఆడియన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను కలిగించాయి. దీంతో స్టార్ హీరోలు కూడా విజయ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా కావటంతో ఉత్తరాది ప్రేక్షకులను కూడా అర్జున్‌ రెడ్డి అలరించాడు. దీంతో పలువురు స్టార్లు కూడా విజయ్‌ నటనకు ఫిదా అయ్యారు.

ఇప్పటికే పలువురు ఉత్తారాధి భామలు తమకు విజయ్‌ దేవరకొండ తమ ఫేవరెట్ హీరో అని, అతని నటించాలని ఉందని చెప్పారు. ఈ లిస్ట్‌ లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌, బాలీవుడ్ యంగ్ సెన్సేషన్‌ అలియా భట్ లాంటి వారు ఉండటం విశేషం. అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో అందాల భామ వచ్చి చేరింది. తెలుగులో మంజుల తెరకెక్కించిన మనసుకు నచ్చింది, రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కిన రాజుగాడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన బ్యూటీ అమైరా దస్తుర్‌.
Amyra Dastur flaunting her sexy legs | Amyra Dastur hot and sexy ...

తరువాత బాలీవుడ్ చెక్కేసిన ఈ బ్యూటీ అక్కడ పలు క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తుంది. ఈ భామ లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం కావటంతో ఓ మీడియా సంస్థలు ఫోన్‌ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్య్వూలో తనకు విజయ్ అంటే చాలా ఇష్టమని అతని మీద క్రష్‌ ఉందని చెప్పింది. అంతేకాదు అవకాశం వస్తే అతనితో కలిసి నటించేందుకు ఎదురుచూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది అమైరా. ఇటీవల బాలీవుడ్‌లో రాజ్మా చావ్లా, ప్రస్థానం లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ.