టాలీవుడ్ దర్శకులు హీరోయిన్లను తెరపై చూపించే విధానం తనకు నచ్చదని, వారు హీరోయిన్లను వస్తువులలాగా చూపిస్తారని సంచలన కామెంట్స్ చేసింది నటి అమృతారావు. 2007లో వచ్చిన 'అతిథి' సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది అమృతారావు. 

ఈ సినిమా తరువాత ఆమె మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. దానికి గల కారణాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. 'అతిథి' సినిమాలో నటిస్తున్నప్పుడు ఒకే నెలలో మూడు సినిమాలలో నటించే అవకాశం వచ్చినట్లు కానీ దానికి ఒప్పుకోలేనట్లు వెల్లడించింది. 

టాలీవుడ్ దర్శకులు హీరోయిన్ల పాత్రలను చూపించే విధానం తనకు నచ్చదని స్పష్టం చేసింది. హీరోయిన్లను కేవలం వస్తువులలాగే చూపిస్తారని సంచలన కామెంట్స్ చేసింది. అలాంటి పాత్రలు తనకు కరెక్ట్ కాదనిపించి తెలుగు సినిమాల్లో నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. మహేష్ 'అతిథి' సినిమాలో ఎందుకు నటించిందనే విషయంపై కూడా కామెంట్ చేసింది.

సినిమాలో తన పాత్ర మహేష్ బాబు రోల్ కి సమానంగా ఉంటుందని ఆ కారణంగానే సినిమా ఒప్పుకున్నట్లు చెప్పింది. ఈ బ్యూటీకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఇటీవల 'థాక్రే' సినిమాలో మీనాతాయ్ పాత్రలో అమృత నటించింది.