చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు సిద్దార్థ్ - అదితీరావు హైదరీ. మహాసముద్రంలో కలిసి నటించన వీరు.. అప్పటి నుంచీ ప్రేమలో మునిగి తేలున్నారు అన్న రూమర్స్ వినిపిస్తున్న టైమ్ లో.. వీటిపై స్పందించింది హీరోయిన్.
హీరో సిద్థార్ధ్ తో తన రిలేషన్ షిప్ పై వస్తున్న వార్తలపై స్పందించింది హీరోయిన్ అదితీరావు హైదరీ. మహాసముద్రం సినిమా టైమ్ నుంచి కలిసి తిరుగుతున్నారు ఈ ఇద్దరు స్టార్లు. పార్టీలు, ఫంక్షన్లు అంటూ.. కలిసి సందడి చేస్తున్నారు. దాంతో వీరు ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ వార్తలు గత కొద్ది కాలంగా జోరుగా సాగుతున్నాయి. ఈక్రమంలో ఈ వార్తలపై స్పందించింది అదితీరావు హైదరీ. తాజ్ సినిమా సక్సెస్ అవ్వడంతో.. ఓ ఛానల్ కుఇంటర్వ్యూ ఇచ్చింది బ్యూటీ. ఈసందర్బంగా విలేకరి అడిగిన ప్రశ్నకు దిఫరెంట్ గా సమాధానం చెప్పింది.
సిద్థార్ధ్ తో మీరు రిలేషన్ లో ఉన్నారా..? బయట జరుగుతున్న ప్రచారానికి మీరు ఏం సమాధానం చెపుతారు అంటూ.. అడిగిన ప్రశ్నకు.. అదితీ స్పందిస్తూ.. ఈ ప్రశ్న తనకు ఆడియన్స్ నుంచి రాలేదన్నది. తన ఫ్యాన్స్ కూడా ఎప్పుడూ ఈ ప్రశ్న అడగలేదంటుంది అదితీ. అంతే కాదు ఇలాంటిది ఏమైనా ఉంటే ముందుగా తాను చెపుతానంటుంది అదితీరావు హైదరీ. అంతే కాదు అందరితో పంచుకోవల్సిన విషయం ఏదైనా ఉంటే.. తానే ముందుగా ఆ విషయం వెల్లడిస్తానంటోంది అదితీరావు హైదరీ.
అంతే కాదు కొంత మందికి మా గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలాంటి విషయాలు.. తెలుసుకోవాలి అని ఉంటుంది. మరికొంత మందికి తమ సినిమాల గురించి..తమను స్క్రీన్ పై చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నారు. ఆడియన్స్ తమపై చూపించి అభియానంతోనే.. ఇంకా పనిమీద ప్రేమ పెరుగుతుందన్నారు అదితీ. అంతే కాదు దాని కోసం తాము ఎంత కష్టపడటానికైనా రెడీ అంటున్నారు.
మేము కష్టపడి పనిచేయాలి.. మీకు మంచి కంటెంట్ అందించాలి.. మాను ఉన్న ఆలోచన అది ఒకటే అన్నారు అదితీరావు. ఇక మరోసారి ఆమెను సిద్థార్ద్ తో డేటింగ్ గురించి ప్రశ్నించగా.. ఆమె హసహనానికి గురయ్యారు. అంతే కాదు మీకుఏం అభిప్రాయం ఉంది.. ఒక వేళ నేను ఏది చెప్పినా... మీరు మీకు నచ్చింది రాసుకుంటారు.. దానికి నేనేం చేయ్యాలి అంటూ సమాధానం చెప్పింది బ్యూటీ. అంతే కాదు ఈప్రశ్న ఆడియన్స్ నుంచి వస్తుంది మేడమ్ అని విలేకరి అనగా.. నన్నెప్పుడూ.. ఆడియన్స్ కాని.. ఫ్యాన్స్ కాని నన్ను ఎప్పుడూఈ ప్రశ్న అడగలేదంటూ ఇంటర్వ్యూను ముగించారు అదితీ.
