Asianet News TeluguAsianet News Telugu

శ్రీలీల అంత ఫేమస్ ఎందుకు అవ్వలేదు.. హీరోయిన్ అంజలికి అవమానం...

హీరోయిన్ అంజలి రిపోర్టర్ పై కాస్త ఫైర్ అయ్యారు. మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్న ఆమెను అవమానించినట్టుగా ఉండటంతో.. షాక్ అయ్యింది అంజలి. ఇంతకీ  అసలు కథ ఏంటంటే..? 

Heroine Actress anjali Fire on  Reporter JMS
Author
First Published Jan 7, 2024, 8:30 AM IST


హీరోయిన్ అంజలికి అవమానం ఎదురయ్యింది. ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్న అంజలి.. మధ్యలో ఎన్నో ఒడిడుకులు ఫేస్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలో ఎవరుూ పట్టించుకోకపోవడంతో..తమిళ్ కు షిప్ట్ అయిన అంజలీ..అక్కడ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  టాలీవుడ్ లో ఫోటో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత  బింబిసార దర్శకుడు వశిష్ట హీరోగా నటించిన ప్రేమలేఖ రాశా  అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.  అయితే ఈరెండు సినిమాలు ఆమె కెరీర్ కు ఏమాత్రం  ఉపయోగపడలేదు. దాంతో ఆమె కోలీవుడ్ గడపతొక్కింది. 

తమిళంలో షాపింగ్ మాల్  సినిమాతో అదరగొట్టిన అంజలి.. జర్నీ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది.  ఆమెకు ఈరెంటు సినిమాలు మంచి బ్రేక్ ఇచ్చాయి. దీంతో తెలుగులోకీ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది అంజలి.  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగులో కూడా తన సత్తా చాటి తానేంటో నిరూపించుకుంది.  ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో.. తెలుగులో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికీ ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంది.

ప్రస్తుతం రాంచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది అంజలి. అంతే కాదు ఆమె లీడ్ రోల్ లో విమెన్ సెంట్రిక్ మూవీస్ కూడా వచ్చాయి. ఈక్రమంలోనే  2014 లో అంజలి  ప్రధాన పాత్రలో రూపొందిన ‘గీతాంజలి’ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈ సీక్వెల్ రూపొందనుంది. శివ తుర్లపాటి దర్శకుడు. కోన వెంకట్, ఎం.వి.వి. సత్యనారాయణ.. నిర్మాతలు.

ఇక ఈసినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ నేపథ్యంలో మీడియా మీట్ ను నిర్వహించారు మూవీ టీమ్. అందులో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న అంజలికి కోపం తెప్పించింది.  రిపోర్టర్ ఏమని ప్రశ్నించిందంటే..? మీకు నేను అభిమానిని, మీరు తెలుగమ్మాయి అవ్వడం వల్లే ఇంకా సరైన బ్రేక్ రాలేదు అని ఎప్పుడైనా అనిపించిందా?’ అంటూ ఆ రిపోర్టర్ అంజలిని ప్రశ్నించింది. దీనికి అంజలి  కాస్త కోపం గా సమాధానం చెపుతూ.. నాకు బ్రేక్ రాకపోతే మీరు నా అభిమాని ఎలా అయ్యారు అని ముఖం మీదనే అనేసింది. 

అంతే కాదు  నేను తెలుగులో చేయకపోవచ్చు.. కాని  తమిళంలో కూడా సినిమాలు చేస్తూనే ఉన్నాను అంటూ ఘాటుగా బదులిచ్చింది. దాంతో మళ్లీ లీడ్ తీసుకున్న రిపోర్టర్.. శ్రీలీల కూడా తెలుగు అమ్మాయే కదా.. కాని ఆమె రేంజ్ లో మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు అంటూ మరోసారి కోపం వచ్చేలా ప్రశ్నించింది. ఒక రకంగా అంజలికి చిరాకు తెప్పించింది. ఆ నెంబర్ గేమ్స్ ని నేను పట్టించుకోను, నాకు నచ్చిన పాత్రలే చేస్తాను.. అయినా నేను ఖాళీగా లేను కదా..  నేను ఇప్పటికీ బిజీగా సినిమాలు చేస్తూనే ఉన్నాను.  అంటూ మరోసారి ఘాటుగా బదులిచ్చింది. ప్రస్తుతం అంజలి ఎపిసోడ్ వైరల్ న్యూస్ అవుతోంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios