హీరోయిన్ సంయుక్త హెగ్డే తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని మీడియాకు తెలియజేశారు. పట్టపగలే కొందరు యువకులు వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయంలోకి వెళితే శుక్రవారం బెంగుళూరులో గల అగర లేక్ దగ్గర గల పార్కులో సంయుక్త మరియు ఆమె ఫ్రెండ్స్ జాగింగ్ కి వెళ్ళారట. పార్కులో వ్యాయామం చేస్తున్న వీరి వద్దకు ఓ మహిళ రావడంతో పాటు వీరిని దూషించడం మొదలుపెట్టారట. ఇవేమి బట్టలు, మీరేమైనా క్యాబిరే డాన్సర్సా అన్నారట. 

రాయకుడని భాషలో వారిని తిట్టిన ఆమె, మీరు ఇలాంటి బట్టలేసుకుని తిరిగితే ఎదో ఒకరోజు మీరు పెద్ద సమస్యను ఎదుర్కొంటారని హెచ్చరించారట. కాసేపటికి ఓ పది మంది యువకుల వరకు అక్కడ చేరుకున్నారట. సదరు మహిళకు సపోర్ట్ గా వారు కూడా సంయుక్తను తిట్టడం మొదలుపెట్టడం తో పాటు వాళ్ళను రౌండ్ అప్ చేసి ఇబ్బంది పెట్టారట. ఆ సంఘటన మొత్తాన్ని సంయుక్త ఫోన్ లో చిత్రీకరించడంతో పాటు దగ్గర్లో ఉన్న స్టేషన్ లో పిర్యాదు చేశారట. 

పోలీసులు మీదేమి తప్పులేదని చెప్పి, వారిపై చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారట. పట్టపగలు పార్కులో తనపై అలా వేధింపులకు తెగబడడం దిగ్బ్రాంతికి గురిచేసిందని ఆమె చెప్పారు. ఇక 2018లో నిఖిల్ హీరోగా వచ్చిన కిరాక్ పార్టీ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటించింది.