విజయ్ దేవరకొండ తో దర్శకుడు శివ నిర్వాణ తో ఓ మూవీ ప్లాన్ చేశారట. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా, శివ నిర్వాణ కియారా అద్వానీని తీసుకోవాలి అనుకున్నారట. 

2018లో విడుదలైన మహానటి ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)తో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ కెరీర్ ని మార్చేసిన చిత్రమది. ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించారు. వీరిద్దరి మధ్య పెద్దగా రొమాన్స్ లేకపోయినా లవర్స్ గా కనిపించారు. కాగా ఈ జంట మరలా కలిసి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ, సమంత ఓ మూవీ చేస్తున్నారు. 

 విజయ్ దేవరకొండ తో దర్శకుడు శివ నిర్వాణ తో ఓ మూవీ ప్లాన్ చేశారట. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా, శివ నిర్వాణ కియారా అద్వానీని తీసుకోవాలి అనుకున్నారట. అయితే ఆమె పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నందున కియారా ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. దీంతో తమ నెక్స్ట్ ఆప్షన్ గా సమంతను తీసుకున్నారట. సమంత (Samantha) విజయ్ దేవరకొండతో నటించడానికి ఒప్పుకున్నారట. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా వార్త. 

ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద చిత్రాలు చేస్తున్నారు. శాకుంతలం షూట్ పూర్తి కాగా... యశోద చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే ఆమె కొన్ని వెబ్ సిరీస్లు ఒప్పుకున్నారు. సమంత నుండి రానున్న కాలంలో భారీ ప్రాజెక్ట్స్ రానున్నాయి. విజయ దేవరకొండతో ఆమె చేయనున్న మూవీపై అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఈ కాంబినేషన్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇక విజయ్ దేవరకొండ (Vijay devarkonda)లైగర్ చేస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా... విజయ్ ఫైటర్ రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.