Asianet News TeluguAsianet News Telugu

అందుకే ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయా

హీరోయిన్ గా చాలా కాలం ఇండస్ట్రీలో కొనసాగాలని అందరూ కోరుకుంటారు. రిచా భిన్నంగా అవకాశాలు కూడా కాదని వేరే మార్గం ఎంచుకుంది. అర్థంతరంగా పరిశ్రమను వీడడం వెనుక గల కారణాలను రిచా తాజా ఇంటర్వ్యూలో తెలియజేశారు.  

heroin richa langella why she left industry so early ksr
Author
Hyderabad, First Published Nov 26, 2020, 12:11 PM IST

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రిచా గంగోపాధ్యాయ్ 2005లో మిస్ ఇండియా మిచిగన్ పీజన్ కిరీటం అందుకున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల లీడర్ మూవీతో రిచాను హీరోయిన్ ని చేయడం జరిగింది. దగ్గుబాటి రానా డెబ్యూ మూవీగా వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ లీడర్ లో రిచా మెయిన్ హీరోయిన్ గా చేయడం జరిగింది. ఆ తరువాత మిరపకాయ్, మిర్చి వంటి హిట్ చిత్రాలలో రిచా హీరోయిన్ గా చేయడం జరిగింది.

కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలోనే హఠాత్తుగా సినిమాలకు గుడ్ బై చెప్పింది రిచా.  హీరోయిన్ గా చాలా కాలం ఇండస్ట్రీలో కొనసాగాలని అందరూ కోరుకుంటారు. రిచా భిన్నంగా అవకాశాలు కూడా కాదని వేరే మార్గం ఎంచుకుంది. అర్థంతరంగా పరిశ్రమను వీడడం వెనుక గల కారణాలను రిచా తాజా ఇంటర్వ్యూలో తెలియజేశారు. 

తనకు ఎప్పటి నుండో ఎంబీఏ పూర్తి చేయాలనేది కలగా ఉందట. ఆ అవకాశం రావడంతో సినిమాలను వదిలేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. 2017లో వాషింగ్టన్ యూనివర్సిటీ నుండి రిచా ఎంబీఏ డిగ్రీ పొందారు. అదే సమయంలో తన క్లాస్ మేట్ జో లంజెల్లా ప్రేమలో పడిన ఆమె 2019లో అతనిని వివాహం చేసుకోవడం జరిగింది. నాగార్జున హీరోగా 2013లో విడుదలైన భాయ్ రిచా చివరి చిత్రం. 

Follow Us:
Download App:
  • android
  • ios