కన్నడ చిత్రం గిల్లితో వెండితెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్... కెరటం మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ వంటి హీరోలతో రకుల్ సినిమాలు చేశారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టార్ డమ్ ఎంజాయ్ చేసిన రకుల్ ప్రీత్ చేతినిండా ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. ఆమె సౌత్ అండ్ నార్త్ అనే బేధం లేకుండా అనేక పరిశ్రమలలో చిత్రాలు చేస్తున్నారు.

 తెలుగులో నితిన్ హీరోగా దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న చెక్ మూవీలో రకుల్ హీరోయిన్ గా చేస్తున్నారు. అలాగే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఓ మూవీలో కూడా రకుల్ హీరోయిన్ గా నటించడం విశేషం. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు మూవీలో రకుల్ ఒక హీరోయిన్ గా చేస్తున్నారు. అలాగే శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. 

బాలీవుడ్ పై పూర్తి ఫోకస్ పెట్టిన రకుల్ అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది.  అర్జున్ కపూర్‌తో `సర్దార్ అండ్ గ్రాండ్ సన్`, జన్ అబ్రహంతో `ఎటాక్`, అజయ్ దేవ్‌గణ్ `మే డే` సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం రకుల్ చేతిలో అరడజనుకు పైగా ఆఫర్స్ ఉన్నాయి. అలా అన్ని పరిశ్రమలను బ్యాలన్స్ చేస్తూ... రాకెట్ వేగంతో దూసుకుపోతుంది రకుల్ ప్రీత్ సింగ్. కాగా ఇటీవల రకుల్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన రకుల్ ప్రీత్ సింగ్... తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు.