మలయాళ బ్యూటీ నివేదా థామస్ కి మంచి నటిగా పేరుంది. గత ఏడాది ఈమె ప్రధాన పాత్రలో నటించిన బ్రోచేవారెవరురా మూవీ విజయాన్ని అందుకుంది. కెరీర్ బిగినింగ్ నుండి చాలా హిట్ చిత్రాలలో నటించింది ఈమె , మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ మూవీ హిట్ కావడంతో, ఆ నెక్స్ట్ నానితో మరోసారి నిన్ను కోరి చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ రెండు చిత్రాలు నానికి మంచి విజయాలను కట్టబెట్టాయి. 

అనూహ్యంగా ఎన్టీఆర్ నటించిన జై లవకుశ మూవీలో ఒక హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. కాగా ఈమె నటించిన లేటెస్ట్ మూవీ వి. నాని, సుధీర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ పాల్గొంటున్న నివేదా అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

వి మూవీలో తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆమె చెప్పారు. పనిలో పనిగా ఆమె డ్రీమ్ రోల్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ అమ్మడుకి విలన్ రోల్స్  అలాగే  నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయాలని ఉందట. కాగా పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రంలో నివేదా కీలక రోల్ చేస్తున్నారు.