కొద్దిరోజుల క్రితం నగ్మా కరోనా వాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. అయినప్పటికీ ఆమెకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా సోకడంతో తాను క్వారంటైన్ కావడంతో పాటు, చికిత్స తీసుకుంటున్నట్లు నగ్మా తెలిపారు.

హీరోయిన్ నగ్మా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. అయితే కొద్దిరోజుల క్రితం నగ్మా కరోనా వాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. అయినప్పటికీ ఆమెకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా సోకడంతో తాను క్వారంటైన్ కావడంతో పాటు, చికిత్స తీసుకుంటున్నట్లు నగ్మా తెలిపారు. అలాగే మొదటి డోస్ తీసుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండవద్దని, అన్ని రకాల భద్రతా నియమాలు పాటించమని ఆమె అభ్యర్ధించారు. 


90లలో స్టార్ హీరోయిన్ గా నగ్మా, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ పక్కన అనేక చిత్రాలలో నటించారు. సూర్య వైఫ్ జ్యోతికకు నగ్మా సిస్టర్ అవుతారు. ఇక కరోనా సెకండ్ వేవ్ దేశంలో మొదలు కాగా, చాలా మంది బాలీవుడ్ ప్రముఖులకు కరోనా సోకింది. నటుడు పరేష్ రావల్ సైతం మొదటి డోస్ కరోనా వాక్సిన్ తీసుకున్నప్పటికీ వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. 


రోజుల వ్యవధిలో రన్బీర్ కపూర్, అలియా భట్, అమీర్ ఖాన్ వంటి ప్రముఖ నటులకు కరోనా సోకింది. మూడు రోజుల క్రితం అక్షయ్ కుమార్ కి కరోనా సోకినట్లు వెల్లడి అయ్యింది. వరుసగా బాలీవుడ్ నటులు కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తుంది. దీనితో కరోనా లాక్ డౌన్ పరిస్థితులు తలచుకొని చాలా మంది భయపడుతున్నారు.