వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ఎప్పుడూ వార్తలలో ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు కలిగిన ఈ ఆయన నేరారోపణలు ఎదుర్కోవడం జరిగింది. కొన్ని కేసులలో జైలుపాలైన నిత్యానంద తన భక్త గణాన్ని వేల సంఖ్యలలో కొనసాగిస్తున్నారు. ఆయన ఆశ్రమం పేరిట వందల కోట్ల ఆస్తులు వున్నాయి. ఈయన భక్తులుగా రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్ లో తమిళ వివాదాస్పద నటి మీరా మిథున్ చేరారు. ఆమె నిత్యానంద స్వామిజీ తో కలిసి ఆయన కొత్తగా నిర్మించనున్న కైలాస దేశానికి పోతాను అంటుంది. 

అందరూ నిత్యానంద స్వామిజీని అపార్ధం చేసుకుంటున్నారని ఆయన దైవాంశ సంభూతులు అని ఆమె చెప్పడం విశేషం. ఇక నిత్యానంద స్వామీజీతో కలిసి ఆ కైలాస దేశానికి వెళ్ళిపోతాను అంటుంది. గతంలో అనేక కాంట్రవర్సీలలో ఉన్న మీరా మిథున్ వ్యాఖ్యలు కోలీవుడ్ లో సంచలనంగా మారాయి. గతంలో మీరా మిథున్ త్రిషా, సూర్య, విజయ్ భార్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన వీడియోలు విడుదల చేసింది.  

నిత్యానంద విదేశాలలో ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసి కైలాస దేశం నిర్మించనున్నాడు. అక్కడ నిత్యానంద స్వామిజీ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే ఆ దేశం కోసం నిత్యానంద ప్రత్యేకమైన రెన్సీ కూడా ముద్రిస్తున్నారు. ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం నిత్యానంద భక్తులు ఈ కైలాస దేశంలో ఉంటారు.   ఈ కైలాస దేశానికే మీరా మిథున్ వెళతాను అంటుంది.