బచ్చన్ పాండే చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కృతి సనన్ సెక్సిజం(Sexism) పై కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా మంది మేల్ యాక్టర్స్ లేడీ క్యారెక్టర్స్ అలా ఉంటే మూవీ చేయరంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు.
నటి కృతి సనన్, అక్షయ్ కుమార్ నటించిన 'బచ్చన్ పాండే' చిత్రాన్ని మార్చి 18 న విడుదలకు సిద్దమవుతుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. గత ఏడాది కృతి(Kriti Sanon)కి బాగా కలిసొచ్చింది. ఆమె నటించిన 'హమ్ దో హమారే దో' 'మిమి' రెండు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ‘మిమి’లో కృతి ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా కృతి ఫేమ్ మరో స్థాయికి చేరింది. ఇక బచ్చన్ పాండే చిత్ర ప్రమోషన్స్ లో కృతి సనన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికర రేపుతున్నాయి.
బాలీవుడ్ లో పురుషాధిపత్యం ఉంది. హీరో పాత్రకు సమానంగా హీరోయిన్ పాత్ర ఉంటే మూవీ చేయనని చెప్పే నటులు చాలా మంది ఉన్నారు. ఓ మూవీలో నా పాత్రకు 60% హీరో పాత్రకు 40% హీరో పాత్రకు స్క్రీన్ స్పేస్ ఉంటే చేయనని చెప్పే మేల్ యాక్టర్స్ ఉన్నారు. ఈ ఆలోచనా విధానంలో మార్పు రావాలి. అత్రంగి రే మూవీ విషయంలో అక్షయ్ కుమార్ సాహసానికి మెచ్చుకోవాలి. ఆ మూవీలో ఆయన పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ నిడివి తక్కువగా ఉంటుంది. అయినా అక్షయ్ (Akshay Kumar)నిజాయితీతో ఆ పాత్ర చేశారు.
కథలు రాసే దర్శకులు, రచయితల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సి ఉంది. ఇంకా మాట్లాడుతూ... బరేలీ కి బర్ఫీ చేసిన తర్వాత, నాకు వచ్చిన 99 శాతం సినిమాలు అదే జోనర్ లో చేశాను. ప్రస్తుతం నాకు భిన్నమైన పాత్రలు చేసే అవకాశం దక్కుతుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసే అవకాశం కూడా వస్తుంది. నేను కోరుకున్న, ఆశించిన పాత్రలు చేసే అవకాశం దక్కుతుందని... ఆమె తెలియజేశారు.
ఇక కృతి కెరీర్ టాలీవుడ్ లోనే మొదలైంది. ఆమె మొదటి చిత్రం వన్ నేనొక్కడినే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో మహేష్ కి జంటగా కృతి నటించారు. ఆ తర్వాత తెలుగులో దోచేస్తా మూవీ చేశారు. ఈ రెండు చిత్రాలు ఆశించినంత విజయం సాధించలేదు. ఆదిపురుష్ మూవీతో చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఆదిపురుష్ మూవీలో రాముడు ప్రభాస్(Prabhas) కి జంటగా జానకి పాత్ర చేస్తున్నారు. ఆదిపురుష్ మూవీ 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు.
