Asianet News TeluguAsianet News Telugu

బేబీ బంప్ చూపిస్తూ కరీనా కపూర్ క్రేజీ ఫోజులు... వైరల్ గా ఇంస్టాగ్రామ్ ఫొటోస్

రెండో కుమారుడిని కనక ముందు నిండు గర్భంతో కరీనా ఫోటో షూట్ చేశారు. బేబీ బంప్ చూపిస్తూ కరీనా చేసిన ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. కరీనా కపూర్ బేబీ బంప్స్ తో కూడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 
 

heroin kareena kapoor shares throw back pics when she had baby bump ksr
Author
Hyderabad, First Published Jul 11, 2021, 6:00 PM IST

స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికిపైగా బాలీవుడ్ ని ఏలింది కరీనా కపూర్. అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన కరీనా హీరో షాహిద్ కపూర్ తో చాలా కాలం ప్రేమాయణం నడిపింది. సిన్సియర్ లవర్ గా అతని కెరీర్ కోసం తన సినిమాలలో అవకాశాలు ఇప్పించింది. అయితే షాహిద్ మరో హీరోయిన్ విద్యా బాలన్ తో సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసి, అతనికి బ్రేకప్ చెప్పింది. 


ఇక 2012లో సైఫ్ అలీ ఖాన్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు కరీనా. సైఫ్ కి ఇది రెండవ వివాహం. గతంలో అమృత సింగ్ ని వివాహం చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చారు. అమృతా సింగ్ కి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ ఇద్దరు పిల్లలు. కాగా 2016లో కరీనా కపూర్ లో ఓ అబ్బాయికి జన్మనివ్వడం జరిగింది. ఆ బాలుడికి తైమూర్ అలీ ఖాన్ అని నామకరణం చేశారు. ఇక ఏడాది కరీనా కపూర్ మరో అబ్బాయికి జన్మినిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే కరీనా తన రెండవ కుమారుడిని కూడా పరిచయం చేసింది. 


కాగా రెండో కుమారుడిని కనక ముందు నిండు గర్భంతో కరీనా ఫోటో షూట్ చేశారు. బేబీ బంప్ చూపిస్తూ కరీనా చేసిన ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. కరీనా కపూర్ బేబీ బంప్స్ తో కూడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


మరోవైపు కరీనా అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ ఆధారంగా లాల్ సింగ్ చద్దా తెరకెక్కుతుంది. ఈ మూవీలో హీరో నాగ చైతన్య జవాన్ రోల్ చేయడం విశేషం. చైతూకి ఇది బాలీవుడ్ డెబ్యూ చిత్రం. 

Follow Us:
Download App:
  • android
  • ios