హైదరాబాద్ అందం అదితి రావ్ హైదరి తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని పేరు. సమ్మోహనం, వి వంటి చిత్రాలలో అదితి హీరోయిన్ గా నటించారు. కాగా అదితి తన మాజీ భర్త సోషల్ మీడియా పోస్ట్ పై స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఎనిమిదేళ్ల క్రితం విడాకులు తీసుకొని విడిపోయిన భర్త పోస్ట్ క్రింద కామెంట్ పెట్టడం వెనుక కారణం ఏమిటని అందరూ అనుకుంటున్నారు. 


కెరీర్ బిగినింగ్ లోనే అదితి ప్రేమలో పడ్డారు. 2009లో ఆమె బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు. అభిప్రాయ బేధాలు రావడంతో 2013లో విడాకులు తీసుకొని అధికారికంగా విడిపోయారు. కాగా సత్యదీప్ మిశ్రా తన పెట్ డాగ్ తో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ కి అదితి 'ఊఫ్' అంటూ కామెంట్ పెట్టింది. విడిపోయి ఎనిమిదేళ్లు అవుతుండగా మాజీ భర్త ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి అదితి ఎందుకు కామెంట్ పెట్టారని నెటిజన్స్ వాపోతున్నారు . 


ఒకవేళ అదితికి సత్యదీప్ మిశ్రాపై మనసు మళ్ళిందేమో అని కొందరు భావిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా అదితి సింగిల్ గానే ఉంటున్నారు. సత్యదీప్ మాత్రం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాజా గుప్తాతో సన్నిహితంగా ఉంటున్నాడని సమాచారం. మరోవైపు శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహాసముద్రం మూవీలో అదితి హీరోయిన్ గా నటిస్తున్నారు.