బాలీవుడ్ క్రేజీ హీరో ఆయుష్మాన్ ఖురానా సతీమణి తహీరా కశ్యప్ ఇటీవల రొమ్ము క్యాన్సర్ తో బాధపడ్డారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. మహిళలపై రొమ్ము క్యాన్సర్ లో అవగాహనా కల్పించేందుకు తహీరా సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్ లు పెడుతూ వచ్చారు. ఆ సందర్భంలో ఆమె షేర్ చేరిన కొన్ని ఫోటోలు వివాదాస్పదం కూడా అయ్యాయి. 

తాజాగా తహీరా తా భర్తతో ఉన్న స్టైలిష్ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోపై ఓ నెటిజన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు, నువ్వు చూడడానికి నీ భర్తకు తమ్ముడిలా ఉన్నావు అంటూ ఆమె రూపాన్ని విమర్శించాడు. దీనికి తహీరా కూడా అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇలాంటి జోకులు నిత్యం వింటూనే ఉన్నాను. 

మీ కామెంట్స్ వల్ల నా భర్తని చూసినప్పుడల్లా 'తూ మేరా భాయ్ నహీ హై' అనే పాట బ్యాగ్రౌండ్ లో వినిపిస్తోంది. మా ఇద్దరి హెయిర్ స్టైల్స్ చూడండి.. వేర్వేరుగా ఉన్నాయి కదా అని తహీరా సమాధానం ఇచ్చారు. ఇలాంటి కామెంట్స్ కు బాధపడే రోజులు ఎప్పుడో పోయాయి.. పైగా ఈ కామెంట్స్ వల్ల వినోదాన్ని పొందుతున్నట్లు తహీరా సమాధానం ఇచ్చింది.