మాజీ బ్యాట్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా బ్యాట్మింటన్ అకాడమీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిన్న తెలంగాణా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని సుజాత స్కూల్ లో గుత్తా జ్వాలా అకాడమీ ఫర్ ఎక్సలెన్స్ పేరుతో అంతర్జాతీయ బాడ్మింటన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. 

ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు గుత్తా జ్వాల ప్రియుడు తమిళ్ హీరో విష్ణు విశాల్ ఒకింత విచారం వ్యక్తం చేశాడు. ఈ సంధర్భంగా సోషల్ మీడియా వేదికగా తన సందేశం తెలియజేశాడు. 

అంతర్జాతీయ స్థాయి బాడ్మింటన్ అకాడమీ స్థాపించిన జ్వాలకు ఇది గొప్ప రోజు. ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు నన్ను క్షమించు, ఐతే నేను, నా ట్విటర్ ఫ్రెండ్స్ నీకు శుభాకాంక్షలు  తెలియజేస్తున్నాం... ఐతే గుర్తించుకో ఇది బిగినింగ్ మాత్రమే' అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. 

విష్ణు విశాల్ మరియు గుత్తా జ్వాలా కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. వీరిద్దరూ ఇటీవలే ఎంగేజ్మెంట్ జరుపుకోవడం జరిగింది. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోనున్నారు. విష్ణు విశాల్ రజిని నటరాజన్ అనే అమ్మాయిని వివాహం చేసుకొని 2018లో విడిపోయారు. గుత్తా జ్వాలా 2011లో భర్త చేతన్ ఆనంద్ కి విడాకులు ఇచ్చింది.