Asianet News TeluguAsianet News Telugu

మరోసారి కోర్టులో విశాల్ కి చిక్కులు.. ఈసారి బ్యాంక్ అకౌంట్స్ టార్గెట్..

హీరో విశాల్ వివాదాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన్ని వివాదాలు వదలడం లేదు. తమిళనాట రాజకీయ పరంగా, సినిమాల పరంగా పలు వివాదాల్లో విశాల్ పేరు వినిపిస్తూనే ఉంటుంది.

hero vishal once again faces issues in court dtr
Author
First Published Feb 4, 2024, 4:55 PM IST | Last Updated Feb 4, 2024, 4:55 PM IST

హీరో విశాల్ వివాదాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన్ని వివాదాలు వదలడం లేదు. తమిళనాట రాజకీయ పరంగా, సినిమాల పరంగా పలు వివాదాల్లో విశాల్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. విశాల్ కి తమిళంతో పాటు తెలుగులో కూడా సమానమైన క్రేజ్ ఉంది. అందుకే విశాల్ నటించే చిత్రాలు తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. 

కొన్నేళ్ల క్రితం విశాల్.. అన్బు చెళియన్ అనే ఫైనాన్షియర్ వద్ద తన నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీ కోసం రూ 21 కోట్లు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ రుణాన్ని లైకా నిర్మాణ సంస్థ సదరు ఫైనాన్షియర్ కి చెల్లించింది. దీనికి ప్రతిఫలంగా లైకా.. విశాల్ తో ఒక ఒప్పందం చేసుకుంది. తమ డబ్బు చెల్లించే వరకు విశాల్ నటించే చిత్రాల పంపిణి హక్కులు తమకే సొంతం అన్నట్లుగా ఒప్పందం చేసుకున్నారు. 

కానీ ఈ ఒప్పందాన్ని అతిక్రమిస్తూ విశాల్ తన ' సామాన్యుడు' చిత్రాన్ని రిలీజ్ చేసుకున్నాడు. దీనితో లైకా సంస్థ కోర్టుని ఆశ్రయించింది. దీనితో విశాల్ 15 కోట్లు లైకా సంస్థకి ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించాలని ఆదేశించింది.

ఆ మొత్తాన్ని చెల్లించడం లో కూడా విశాల్ విఫలం అయ్యాడు. దీనితో లైకా సంస్థ మరోసారి కోర్టుని ఆశ్రయించింది. తన దగ్గర అంత వనరులు లేవని.. ఇప్పుడు చెల్లించలేనని విశాల్ తన న్యాయవాది ద్వారా కోర్టుకి తెలిపారు. అయితే విశాల్ బ్యాక్ ఖాతాలని అడిట్ చేయాలనీ లైకా సంస్థ కోర్టుని కోరింది. దీనికి న్యాయస్థానం అంగీకరించింది. ఓ ఆడిటర్ ని నియమించి విశాల్ బ్యాంక్ ఖాతాలని , లావాదేవిలని పరిశీలించాలని కోర్టు ఆదేశించింది. బ్యాంక్ ఖాతాల పరిశీలన జరిగిన తర్వాత మరోసారి కోర్టులో ఈ కేసు విచారణ జరగనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios