సూసైడ్ నోట్లో నా పేరు రాస్తా అన్నాడు... మార్క్ ఆంటోని డైరెక్టర్ పై విశాల్ సంచలన కామెంట్స్
విశాల్ లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని. చిత్ర విడుదల సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విశాల్ డైరెక్టర్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పందెం కోడి, వాడు వీడు వంటి చిత్రాలతో తెలుగులో కూడా మార్కెట్ తెచ్చుకున్నాడు విశాల్. కొన్నాళ్లుగా ఆయన చిత్రాలు పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడం లేదు. ఈసారి ఆయన వినూత్నమైన కథతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మార్క్ ఆంటోని సెప్టెంబర్ 15న వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. మార్క్ ఆంటోని ట్రైలర్ ఆకట్టుకోగా మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.
మార్క్ ఆంటోని చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విశాల్ ఈ చిత్ర దర్శకుడు అధిక్ రవీంద్రన్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ''తొమ్మిదేళ్ల క్రితం నా కోసం అధిక్ ఓ కథ రాశాడు. ఒక నిర్మాత అసలు దీన్ని స్క్రిప్ట్ అంటారా? అన్నాడు. మొత్తం 40 మంది నిర్మాతలు రిజెక్ట్ చేశారు. దాంతో ఆ కథ పక్కన పెట్టి 'త్రిష ఇల్లన నయనతార' అనే సినిమా చేశాడు. అది బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ చిత్రం తర్వాత చేసిన AAA ఆడలేదు.
ఒకరోజు ఫోన్ చేసి అన్నా నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నా. లెటర్లో నీ పేరే రాస్తా అని ఫోన్ పెట్టేశాడు. నేను కాల్ బ్యాక్ చేశాను. ఏమైంది అంటే... నువ్వు నాకు డేట్స్ ఇచ్చి ఉంటే నా పరిస్థితి వేరేలా ఉండేది. నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు అన్నాడు. ఖచ్చితంగా చేద్దాము వెయిట్ చేయమన్నాను. నా కోసం 7 ఏళ్ళు వెయిట్ చేశాడు. అధిక్ రవిచంద్రన్ తో మూవీ అనగానే కొందరు వద్దన్నారు. అతడు ఫార్మ్ లో లేడు. హిట్ ఇచ్చిన దర్శకుడితో చేయమన్నారు.
నేను అధిక్ రవిచంద్రన్ కి ఎందుకు అవకాశం ఇచ్చానో సెప్టెంబర్ 15న చూస్తారు... అని విశాల్ చెప్పుకొచ్చారు. మార్క్ ఆంటోని చిత్రంలో దర్శకుడు ఎస్ జే సూర్య కీలక రోల్ చేశారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. సెల్వ రాఘవన్ మరో కీలక రోల్ చేశాడు.