Asianet News TeluguAsianet News Telugu

Vishal: హీరో విశాల్ కి తీవ్రగాయాలు.. షూటింగ్ లో ఊహించని ప్రమాదం, ఏం జరిగిందంటే

హీరో విశాల్ తమిళంలో ఎంత పాపులర్ అయ్యాడో.. తెలుగులో కూడా అంతే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విశాల్ ని టాలీవుడ్ ఫ్యాన్స్ తెలుగు హీరోలాగే భావిస్తారు.

hero vishal injured once again in movie shooting
Author
First Published Aug 11, 2022, 11:08 AM IST

హీరో విశాల్ తమిళంలో ఎంత పాపులర్ అయ్యాడో.. తెలుగులో కూడా అంతే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విశాల్ ని టాలీవుడ్ ఫ్యాన్స్ తెలుగు హీరోలాగే భావిస్తారు. విశాల్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు. ఏది ఏమైనా విశాల్ యాక్షన్ హీరోగా తెలుగు తమిళ భాషల్లో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 

విశాల్ తన సినిమాలు, వివాదాల విషయంలో తరచుగా వార్తల్లో ఉంటాడు. విశాల్ ఎప్పుడూ గాయాల పాలైనట్లు వార్తలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి విశాల్ కి షూటింగ్ లో తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాల్ 'మార్క్ ఆంటోని' అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

గురువారం రోజు ఎర్లీ మార్కింగ్ నుంచే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. భారీ యాక్షన్ ఎపిసోడ్ లో నటించే క్రమంలో విశాల్ కి తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది. దీనితో షూటింగ్ లొకేషన్ లోనే విశాల్ కి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం విశాల్ షూటింగ్ ని విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 

వైద్యులు కొన్ని రోజులు విశాల్ కి విశ్రాంతి అవసరం అని చెప్పారట. దీనితో మార్క్ ఆంటోని షూటింగ్ కి కొంతకాలం బ్రేక్ పడ్డట్లు ఐంది. విశాల్ ఇటీవలే 'లాఠీ' అనే చిత్రాన్ని ఫినిష్ చేశాడు. ఈ మూవీలో విశాల్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. 

ఆ చిత్ర షూటింగ్ లో కూడా విశాల్ గాయాలకు గురయ్యాడు. అంతకు ముందు 'ఎనిమి' షూటింగ్ లో కూడా విశాల్ గాయపడ్డాడు. విశాల్ కి, గాయాలకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు ఉంది. చిన్న చిన్న గాయాలైతే పర్వాలేదు కానీ.. అనుకోకుండా తీవ్ర గాయాలైనప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

కాబట్టి ఇకనైనా విశాల్ యాక్షన్ సీన్స్ విషయంలో ప్రికాషన్స్ తీసుకుని నటిస్తే బెటర్ అని అభిమానులు సూచిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఒరిజినల్ స్టంట్స్ చేసే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో విశాల్ ఒకరు. అందుకే విశాల్ ఇలా తరచుగా గాయాలకు గురవుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

విశాల్ ఇటీవల నటించిన చిత్రాలు గమనిస్తే యాక్షన్, చక్ర, ఎనిమి, సామాన్యుడు, లాఠీ ఇలా అన్ని చిత్రాలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడుకున్న యాక్షన్ కథలే. 

Follow Us:
Download App:
  • android
  • ios