హీరో విశాల్ తమిళంలో ఎంత పాపులర్ అయ్యాడో.. తెలుగులో కూడా అంతే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విశాల్ ని టాలీవుడ్ ఫ్యాన్స్ తెలుగు హీరోలాగే భావిస్తారు.  అయితే కెరీర్ ఆరంభంలో ఉన్న జోరు విశాల్ ఇప్పుడు ప్రదర్శించలేకున్నాడు.

హీరో విశాల్ తమిళంలో ఎంత పాపులర్ అయ్యాడో.. తెలుగులో కూడా అంతే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విశాల్ ని టాలీవుడ్ ఫ్యాన్స్ తెలుగు హీరోలాగే భావిస్తారు. అయితే కెరీర్ ఆరంభంలో ఉన్న జోరు విశాల్ ఇప్పుడు ప్రదర్శించలేకున్నాడు. విశాల్ నటిస్తున్న చిత్రాలు మెప్పిస్తున్నాయి కానీ బిగ్ హిట్ కావడం లేదు. విశాల్ ఎక్కువగా థ్రిల్లర్ జోనర్ లో సినిమాలు చేస్తున్నాడు. విశాల్ ప్రస్తుతం మార్క్ ఆంటోని అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

ఇదిలా ఉండగా తాజాగా విశాల్ తన పెద్ద మనసు చాటుకున్నారు. తన ఫ్యాన్స్ చేస్తున్న పనికి విశాల్ ఫిదా అయ్యాడు. విశాల్ ప్రజా సంక్షేమ సంఘం తరుపున అభిమానులు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. తమిళనాడులో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

ప్రజా సంక్షేమ సంఘం కార్యక్రమాల్లో భాగంగా తిరువళ్లూరు జిల్లాకి చెందిన విశాల్ ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు కన్నన్, చెన్నై ఫ్యాన్స్ అధ్యక్షుడితో కలసి 11 పేద జంటలకు వివాహం జరిపించారు. తన అభిమానులు చేస్తున్న ఈ మంచి పని విశాల్ ని ఎంతగానో కదిలించింది. 

మంచి కార్యక్రమాలని చేస్తున్న తన అభిమానులని మరింత ప్రోత్సహించేలా విశాల్ వారికి బంగారు చైన్లు బహుకరించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో విశాల్ కన్నన్ తో పాటు వివిధ ప్రాంతాలకి చెందిన తన అభిమాన సంఘం అధ్యక్షులకు విశాల్ గోల్డ్ చైన్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. దీనితో విశాల్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.