కోలీవుడ్ హీరో విశాల్ మంగళవారం ఉదయం చెన్నై , కాంచీపురం క్రైం బ్రాంచ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కోర్టు ఆదేశాల మేరకు గత నెల హాజరుకావాల్సిన విశాల్ షూటింగ్ పనుల వల్ల వెళ్లేలేదు. ఇక ఇప్పుడు విచారణలో పాల్గొని పోలీసులకు సహకరించినట్లు చెప్పారు. 

అసలు విషయంలోకి వెళితే.. గతంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష పదవిలో కొనసాగిన శరత్ బాబు - రాధారవిలు కమిటీకి సంబందించిన స్థలాన్ని అక్రమంగా అమ్మేశారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. విశాల్ కమిటీ సైతం కోర్టులో పిటిషన్ వేయగా ఈ కేసును వీలైనంత త్వరగా ఛేదించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

ఈ క్రమంలో హై కోర్టులో కేసును వేరే న్యాయమూర్తి విచారించేలా చూడాలని మరోసారి న్యాయస్థానానికి పిటిషన్ దాఖలు చేశారు విశాల్. ఈ విషయంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరిపి రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా విశాల్ కాంచీపురం నేర పరిశోధన పోలీసుల ఎదుట హాజరయ్యి విచారణలో పాల్గొన్నారు.